రాజాధిరాజా... ఈసారీ రాలే!

Update: 2016-06-24 14:28 GMT
చేసిన సినిమా విడుద‌ల‌వుతోందంటే ఏ హీరో అయినా ఖుషీ అవుతాడు.  కానీ ఓ హీరో మాత్రం ఆ సినిమా వ‌స్తే ఎంత?  రాక‌పోతే ఎంత? అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఒక ద‌శ‌లో ఆ సినిమా రాక‌పోతేనే బావుంటుంది అనుకొంటున్నాడట‌! అందుకు కార‌ణం ఆ సినిమా చేసిన టైమ్‌తో పోలిస్తే ఇప్పుడు ఆ హీరో రేంజ్ పెర‌గ‌డమే. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆసినిమా వ‌స్తే డ్యామేజే త‌ప్ప దాని గురించి పెద్ద‌గా ఒదిగేదేమీ ఉండ‌ని తెలిసిపోవ‌డమే. అయితే ఆ హీరో అనుకొంటున్న‌ట్టుగానే ఆ సినిమా ఎంత‌కీ రావ‌డం లేదు. ఈవారం విడుద‌ల‌వుతుంద‌ని ఊహించారంతా. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఈ వ్య‌వ‌హార‌మంతా శ‌ర్వానంద్  న‌టించిన రాజాధిరాజా సినిమాదే.

శ‌ర్వా క‌థానాయ‌కుడిగా నాలుగైదేళ్ల క్రితం త‌మిళ ద‌ర్శ‌కుడు చేర‌న్ ఏమిటో ఈమాయ పేరుతో  ఓ చిత్రం చేశాడు. అది తెలుగు - త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కింది. కానీ ఆ సినిమా అనుకోని కార‌ణాల‌వ‌ల్ల త‌మిళంలో డీవీడీల్లో విడుద‌లైంది. డీవీడీలో విడుద‌లైన  ఆ బొమ్మ కూడా ఫ్లాప్ టాకే మూట‌గ‌ట్టుకొంది. అయితే ఇప్పుడు అక్క‌డ డీవీడీలో విడుద‌లైన సినిమాని తెలుగులో థియేట‌ర్లలో విడుద‌ల చేసి క్యాష్ చేసుకొందామ‌నుకొన్నారు కొద్దిమంది నిర్మాత‌లు. పైగా తెలుగులో శ‌ర్వా రేంజ్ కూడా పెరిగింది కాబ‌ట్టి, ఆయ‌న విజ‌యాల్లో ఉన్నాడు కాబ‌ట్టి ఓపెనింగ్స్ బాగా వ‌స్తాయ‌నేది ఆ నిర్మాత‌ల ఆలోచ‌న‌.  ఆ ఆలోచ‌న వ‌చ్చిందే ఆల‌స్యం రాజాధిరాజా పేరుతో తెలుగులో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకొన్నారు. కానీ శ‌ర్వానంద్‌కి మాత్రం ఆ సినిమా తెలుగులో విడుద‌ల‌వ‌డం ఇష్ట‌మే లేదు. ఆ సినిమా ప్ర‌స్తావ‌న తీసుకొచ్చినా దాని గురించి మాట్లాడ్డానికి ఆయ‌న అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. అయితే  ఆ సినిమా విడుద‌ల‌కి త‌మిళంలోలాగే తెలుగులోనూ క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. ఈవారం విడుద‌ల చేయాల‌నుకొన్నారు కానీ అది సాధ్యం కాలేదు.
Tags:    

Similar News