యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. 'ఛలో' సినిమా తర్వాత శౌర్య ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారనే చెప్పాలి.
గతేడాది ద్వితీయార్థంలో వచ్చిన 'లక్ష్య' సినిమా పూర్తిగా నిరాశ పరిచింది. 'వరుడు కావలెను' మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఆశించిన వసూళ్ళు రాబట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు నాగశౌర్య కెరీర్ గాడిలో పడాలంటే అర్జెంట్ గా ఓ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ''కృష్ణ వ్రింద విహారి'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శౌర్య. ఇది హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే తగినంత బజ్ క్రియేట్ చేయకపోయిన సినిమాను వారు రెండు భారీ చిత్రాల మధ్య విడుదల చేయడమనేది సరైన నిర్ణయమేనా అనే చర్చ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది.
ఇవాళ (ఏప్రిల్ 14) థియేటర్లలోకి వచ్చిన 'కేజీఎఫ్ 2' సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టే దిశగా దూసుకుపోతోంది. రెండు వారాల తర్వాత అంటే ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా విడుదల కానుంది.
ఇలా రెండు పెద్ద సినిమాల మధ్య ఏప్రిల్ 22న నాగశౌర్య అండ్ టీమ్ తమ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఐరా బ్యానర్ లో రూపొందిన నాలుగో సినిమా. ఇప్పటి వరకు వదిలిన ప్రచార చిత్రాలను బట్టి ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
'కృష్ణ వ్రింద విహారి' ప్రమోషనల్ కంటెంట్ ఓ వర్గం ఆడియన్స్ ను ఆకట్టుకున్నా.. ఆశించిన స్థాయిలో బజ్ అయితే ఏర్పడలేదనే చెప్పాలి. అయినా సరే ఏప్రిల్ 22న విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకోవడానికి కారణం.. నాగశౌర్య కు '2' న్యూమరాలజీ సెంటిమెంట్ గా ఉండటమే అనే టాక్ నెట్టింట వినిపిస్తోంది.
శౌర్య లైనప్ లో అనేక సినిమాలు ఉన్నప్పటికీ.. మార్కెట్ పరంగా చూసుకుంటే ఇప్పుడు కచ్చితంగా ఒక హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఇలానే పెద్ద సినిమాల మధ్య తన సినిమాను తీసుకొచ్చి ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు 'కేజీఎఫ్ 2' & 'ఆచార్య' వంటి రెండు టైటాన్స్ మధ్య తన సినిమాను విడుదల చేసి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
కాగా, ''కృష్ణ వ్రింద విహారి'' చిత్రంలో నాగశౌర్య ఒక బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించనున్నారు. ఇందులో కుర్ర భామ షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో నటించగా.. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - బ్రహ్మజీ - సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుజ్జి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.