ఆమె ఒక చంపే యంత్రం! దానికి రంగుతో ప‌ని లేదు!

Update: 2021-06-10 15:30 GMT
`ఫ్యామిలీ మ్యాన్ 2` సృష్టికర్తలు రాజ్ - డికె `స‌మంత న‌లుపు రంగు`పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్టారు. ఎంపిక చేసుకున్న పాత్ర స్వ‌భావం మేర‌కు స‌మంత అలా క‌న‌ప‌డాల్సొచ్చింద‌ని న‌లుపు తెలుపు అస్స‌లు మ్యాట‌రే కాద‌ని అన్నారు. నిజానికి తెల్ల‌గా ఉన్న స‌మంత‌నే ఎందుక‌ని ఎంపిక చేసుకున్నారు?  న‌లుపు లేదా గోధుమ వ‌ర్ణం ఉన్న వేరొక మంచి న‌టిని ఎంపిక చేసుకుంటే స‌రిపోతుంది క‌దా! అని కొంద‌రు సూచించారు.

అయితే దానికి కౌంట‌ర్ గా రాజ్ అండ్ డీకే ఆస‌క్తిక‌ర వివ‌ర‌ణ ఇచ్చారు. స‌మంత ఒక‌ మిల‌ట‌రీ వ్య‌క్తి .. రెబ‌ల్ తీవ్ర‌వాది..త‌న పాత్ర యుద్ధంలో ఉంటుంది. త‌మిళ వాస‌న ఉంటుంది. అందుకే ఆ పాత్ర‌ను అలా తీర్చిదిద్దామ‌ని రాజ్ అండ్ డీకే వెల్ల‌డించారు. ఆ పాత్ర ఎలా ఉండాలి? అనేది బాధ్యతగల ద‌ర్శ‌క‌నిర్మాతలుగా మేం నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు.

సీజన్ 2లో శ్రీకాంత్ తివారీ(మనోజ్ బాజ్ పేయి )తో తలపడే శ్రీలంకన్‌ తమిళ రెబ‌ల్ రాజీ పాత్రలో స‌మంత న‌టించారు. ఈ పాత్ర కోసం స‌మంత‌ను కాకుండా వేరొక‌రిని తీసుకోవ‌డం స‌రికాద‌ని భావించామ‌ని తెలిపారు. స‌మంత ఈ పాత్ర కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంది. ప్యూర్ త‌మిళం నేర్చుకుంది. అందుకోసం అవ‌స‌ర‌మైన కోచ్ ల‌ను నియ‌మించుకుంది. చాలా శ్ర‌మించింద‌ని రాజ్ అండ్ డీకే వెల్ల‌డించారు. అందం ఛ‌ర్మ సౌంద‌ర్యం గురించి కాదు.. రాజీ పాత్ర‌లో స‌రిగా న‌టించేవారు ఎవ‌రు? అన్న‌ది వెతికితే స‌మంత ఓకే అయ్యార‌ని తెలిపారు.

సమంత త‌న‌ పాత్ర కోసం మూడు నెలలు తీవ్రంగా శిక్షణ తీసుకుంది. ఆమె ఒక చంపే యంత్రం దానికి రంగుతో ప‌ని లేదు! అని రాజ్ అండ్ డీకే వివ‌ర‌ణ ఇచ్చారు.
Tags:    

Similar News