కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సినిమాల పరంగా రెండు విభిన్న దృవాలుగా ఉండే ఇద్దరు జాతీయ అవార్డ్ గ్రహీతలు కలిసి వర్క్ చేయనున్నట్లు ప్రకటన రావడంతో.. ఈ అరుదైన కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా స్టోరీ ఇలా ఉంటుందని.. శేఖర్ కమ్ముల అలాంటి కథ రెడీ చేశారని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఫిలిం సర్కిల్స్ లో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది.
ధనుష్ - శేఖర్ కమ్ముల చిత్రం 1950స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఓ పీరియాడిక్ డ్రామా అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు తమిళులు తెలుగువారు కలిసి జీవించిన సమయంలోని కథాంశాన్ని శేఖర్ కమ్ముల తీసుకుంటున్నారట. అంతేకాదు ఇందులో అత్యల్ప స్థాయి నుండి ఎదిగిన ఒక మద్రాసీ తెలుగు లీడర్ గా ధనుష్ కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని తెలుగు తమిళం హిందీ భాషల్లో భారీ స్థాయిలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది ఏ సమయంలోనైనా ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి వెళ్తుందని.. దీనికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయని మేకర్స్ ప్రకటించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం వివిధ భాషలకు చెందిన స్టార్స్ క్యాస్టింగ్ మరియు టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేయనున్నారు.
ఇన్నాళ్లూ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ధనుష్.. ఈ సినిమాతో డైరెక్ట్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. సున్నితమైన చిత్రాలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న శేఖర్ కమ్ముల.. ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న 'మారన్' '#D44' చిత్రాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత శేఖర్ కమ్ముల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్ నిర్మించిన 'లవ్ స్టోరీ' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు.