#సుశాంత్.. సీబీఐ ద‌ర్యాప్తుపై ఫ్యామిలీ ఆస‌క్తిగా లేదా?

Update: 2020-07-16 05:15 GMT
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నెల రోజులు అయ్యింది. నాటి నుండి అభిమానులు ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. `సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న్యాయం కోసం ఫోరం` ప్రారంభించి అతని అభిమానుల నుండి పెద్ద ఎత్తున‌ మద్దతు పొందిన న‌టుడు శేఖర్ సుమన్.. ఇప్పుడు ఊహించ‌ని విధంగా ఈ కేసు విష‌య‌మై వెన‌కడుగు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సుశాంత్ కేసులో ముందుకు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. సుశాంత్ అకాల మరణం గురించి తెలిశాక‌.. అది ఆత్మహత్య అని ధృవీక‌రించాక‌.. శేఖర్ క‌పూర్ తొలిగా కంటికి క‌నిపించ‌ని ఎన్నో కోణాల గురించి మాట్లాడారు. బాలీవుడ్ లో బ‌య‌ట‌కు తెలియాల్సిన‌వి చాలా ఎక్కువ ఉన్నాయ‌ని ఆవేద‌న చెందారు. సుశాంత్ కుటుంబీకుల‌కు బాస‌ట‌గా నిలిచారు.

ఈ కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు కోసం ఇంత‌ కృషి చేసిన తరువాత.. శేఖర్ తన ఉద్యమం నుండి వైదొలగాలని అనుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ విస్మ‌య‌ప‌రుస్తోంది. దానికి అత‌డు చెప్పిన కార‌ణం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ కేసు విషయంపై సుశాంత్ కుటుంబం పూర్తిగా మౌనంగా ఉండిపోయిందని.. అందువల్ల అది త‌న‌కు అసౌకర్యంగా అనిపించింద‌ని సుమన్ వరుస ట్వీట్లలో పేర్కొన్నాడు. సుశాంత్ కుటుంబ సభ్యుల కోరికను గౌరవించాలని.. అందుకే ఉద్య‌మం విర‌మించాన‌ని తెలిపారు. దీనికి సుశాంత్ అభిమానులందరి అనుమ‌తిని శేఖ‌ర్ సుమ‌న్ కోరారు.

ప్ర‌య‌త్నం ఫలించిందా లేదా అన్న‌ది క‌చ్చితంగా తెలియదు కానీ మ‌న‌ ఐక్యత సమైక్యత బలాన్ని ప్రపంచానికి చూపించగలిగాము. నిలకడ విశ్వాసంతో వ్య‌వ‌స్థ‌ల్ని క‌దిలించ‌గ‌లిగాము అని ఆనందం వ్య‌క్తం చేశారు. సుశాంత్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ప‌లు చిత్రాల్లో శేఖ‌ర్ సుమ‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ కి బాస‌ట‌గా నిలుస్తూ.. కంగ‌న ర‌నౌత్ లాంటి స్టార్లు నెప్టోయిజాన్ని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News