వాయిస్ ఉంది కదా అని.. వాల్యూమ్ పెంచితే.. స్పీకర్లు బద్దలైపోతాయ్.. ఇదండీ మన ''షేర్'' పరిస్థితి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. ఈ ఏడాది మరోసారి హిట్టు టేస్టు చూడ్డానికి వస్తున్న మరో సినిమా ఈ షేర్. ఇప్పటికే పటాస్, టెంపర్ వంటి నందమూరి సినిమాలతో అలరించేసి.. మళ్లీ ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు మన నందమూరి చిన్నోడు. పదండి ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
నిజానికి ఇది మరో మసాలా ప్యాకేజ్డ్ మూవీ. ఈసారి కళ్యాణ్ రామ్ తన వయిలెంట్ టచ్ ను మరింత టోన్ చేశాడు. కంప్లీట్ గా కామెడీతో సాగే సినిమా. ఒక ప్రక్కన మన వంశంలో పెళ్ళిళ్ళు లేవురా అంటూ 30 ఇయర్స్ పృథ్వీ పంచ్ లు పేలుస్తుంటే.. ఇంకోవైపు మీ అన్న కోన వెంకట్ తెలుసు.. తమ్మడు ఆర్ ఆర్ వెంకట్ తెలుసు అంటూ వెంకట్ పంచ్ వేసేశాడు ఎమ్మెస్ నారాయణ. నచ్చితే ఎంతటి రిస్కయినా చేసేస్తా అంటూ మధ్యలో కళ్యాణ్ రామ్. ఫైట్లు.. ఎమోషన్లు.. కత్తిలాంటి గ్లామరస్ హీరోయిన్ సోనాల్ చౌహన్.. వెరసి ఇదో మాస్ మసాలా ప్యాకేజ్ లా అదిరింది.
పటాస్ సినిమా ట్రైలర్ ను కూడా అప్పట్లో ఇలాగే చూసి.. అబ్బే రొటీనే అన్నారు. కాని రిజల్టు తాలూకు వోల్టేజీ చూశాక గుండె గుభేల్ అనేసింది. సో.. ''షేర్'' లో కూడా ఇలాంటి మ్యాటరే ఏదో ఉందని అనుకోవాల్సిందే. కత్తి ఫేం మల్లిఖార్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.