కమిట్ మెంట్ కు నిర్మాతల కోడ్ సిగ్నల్..బాంబు పేల్చిన హీరోయిన్

Update: 2020-05-11 11:10 GMT
షెర్లిన్ చొప్పా.. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ పిచ్చెక్కించే నగ్న ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. సొంతంగా ఒక యాప్ పెట్టి మరీ అందాలను అందులో ఆరబోస్తుంటుంది. తాజాగా ఈ వివాదాస్పద బ్యూటీ మీటూ వివాదంలో పెద్ద నిర్మాతలపై హాట్ కామెంట్స్ చేసింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో షెర్లిన్ నిర్మాతలపై బాంబు పేల్చింది. ఎవరైనా కమిట్ మెంట్ గురించి మనల్ని అడగాలని అనుకుంటే ఒక కోడ్ వాడుతారని షెర్లిన్ చొప్రా తెలిపారు. కెరీర్ మొదట్లో తాను అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండగా నన్ను చాలా మంది కమిట్ మెంట్ అడిగారని.. అందులో చాలా మంది సినీ పెద్దలు కూడా ఉన్నారని తెలిపింది. అందరూ వాడేది ఒకే ఒక్క కోడ్ అని.. డిన్నర్ కి రమ్మనడం.. దానికి పిలిస్తే కమిట్ మెంట్ కోసమే’ అని షెర్లిన్ తెలిపారు.

మొదట్లో తనను రాత్రి 11-12 గంటల మధ్యలో డిన్నర్ కు రావాలని పిలిచేవారని.. తేడాగా ఉందని తాను రిజెక్ట్ చేసిన సందర్భాలున్నాయన్నారు. తాను ఇలా చాలా పెద్ద ఆఫర్లను కూడా వదులుకున్నానని షెర్లిన్ తెలిపారు.
Tags:    

Similar News