నీలి చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా వ్యవహారం బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రాజ్ కుంద్రా తమను మోసం చేశారని చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పటికే మీడియా ఎదుట వచ్చి వాపోయారు. అలాగే కొంతమంది పోలీసుల వద్ద రాజ్ కుంద్రాతో తాము ఎలా ఇబ్బందులు పడ్డామో వివరించారు. వీరిలో షెర్లిన్ చోప్రా ఒకరు. గత ఏప్రిల్ లో షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా వ్యవహరంపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమాల్లో అవకాశాలిస్తామని చెప్పి బోల్డ్ గా నటించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తన ఇంట్లో బలవంతం కూడా చేశారని మీడియా ఎదుటా వాపోయారు. తాజాగా ఈమె ట్విట్టర్ ద్వారా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేయడంతో శిల్పాశెట్టిపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారమంతా శిల్పాకు తెలిసే జరిగిందని కొందరు అన్నారు.ఇందులో భాగంగా పోలీసులు ఆమెను కూడా విచారించారు. అయితే అరెస్టు చేసే వరకు తనకు ఈ విషయం గురించి తెలియదని చెప్పింది. అంతేకాకుండా రాజ్ కుంద్రా చాలా మంచివాడని, తనను ఎవరో తప్పుదోవ పట్టించారని తెలిపింది. అయితే కొందరు శిల్పా తన భర్తపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇన్ని ఆధారాలతో బయటపెట్టినా తన భర్త అమాయకుడని ఎలా అంటావని అంటున్నారు.
ఇందులో భాగంగా షెర్లిన్ చోప్రా తాజాగా రాజ్ కుంద్రాతో కలిపి శిల్పాశెట్టిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'సినిమాల్లో మీరు చాలా కాలంగా ఉంటున్నారు. నటలు బాధకసాధకాలు మీకు తెలుసు. ఎవరైనా కళాకారులను చూసి ప్రభావితం అయితే వారు మీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అందువల్ల రీల్ లైఫ్ నుంచి కాకుండా రియల్ లైఫ్లోకి వచ్చి కళాకారుల జీవితాన్ని చూడండి.. బాధిత మహిళలపై సానుభూతి చూపించండి. మీరు ఇతరులను నమ్మండి.. అప్పుడే మిమ్మల్ని ప్రపంచం నమ్ముతుంది. అంతేకానీ మీ యాంగిల్ మాత్రమే ఆలోచించకండి' అని ట్విట్టర్లో చెప్పింది.
ఇక 'రీల్ లైఫ్లో సాష్టాంగ నమస్కారం చేయడం చాలా సులభం. అలాగే వేదికపై లక్ష్మీభాయ్ గురించి మాట్లాడడం చాలా తేలిక. కానీ మీరు వేదిక మీద కాదు మైదానంలో ఉండాలి. వేదిక మీది నుంచి చూస్తే రీల్ లైఫ్ మాత్రమే కనిపిస్తుంది. అదే నిజ జీవితంలోకి రండి నటుల బాధలు తెలుస్తాయి. బాధిత మహిళల గోడు వినబడుతుంది. ఎప్పుడూ రీల్ లైఫ్లోనే కాకుండా నిజజీవితంలోకి వచ్చి ఏదైనా చేయండి. అశ్లీల ప్రపంచం నుంచి బయటకు రండి.. అప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని ఇలా స్వాగతిస్తుందో గమనించండి..బంగ్లాను వీడి బయటి ప్రపంచానికి రండి.. బాధిత మహిళలకు సాయం చేయండి.. అప్పుడు మీరు బాధిత మహిళలను కలిసినప్పుడు వారి నుంచి వచ్చే రియాక్షన్ చూడండి.. అప్పుడు తెలుస్తుంది. మీకు సాష్టాంగ నమస్కారం విలువ.. ' అని కామెంట్స్ చేసింది.
ఇంకా షెర్లిన్ చోప్రా తన గురించి చెబుతూ ' ఎప్పుడూ సినిమాలు చేస్తే జీవితానికి అర్థం ఏముంటుంది...? అందుకే దేశం కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నాను. సమాజ సేవలోకి వెళ్తారు. ఎంతకాలం ఈ సినీ జీవితంలో సాగాలి..? అందుకే మహిళలు,పిల్లల కోసం సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా..ఇంకా ఏదైనా చేయాలనే తపన ఉంది. ఈ దేశంలో పుట్టిన నేను నా దేశం కోసం రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఏదో రూపంలో బాధితులకు సాయం చేయాలన్నదే నా తపన..' అని అన్నారు.