ఔను.. డబ్బు కోసం కొందరి దగ్గర పడుకున్నా.. అంటూ ఆ మధ్య సెన్సేషనల్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా. షెర్లిన్ బోల్డ్ అని తెలుసు కానీ.. మరీ ఇంత బోల్డా అని అంతా ఆశ్చర్యపోయారప్పుడు. షెర్లిన్ కామెంట్లు చూసి వందల మంది ఆమె ట్విట్టర్లో ఇలాంటి ప్రపోజల్స్ కూడా పెట్టారు. దెబ్బకు ట్విట్టర్ నుంచి పారిపోయిందామె.ఐతే ఆ రోజు తాను చేసిన కామెంట్ల మీద షెర్లిన్ ఇప్పుడు వివరణ ఇచ్చింది. తాను ఎందుకు ఒళ్లు అమ్ముకోవాల్సి వచ్చిందో ఆమె వెల్లడించింది. నిజానికి తాను చిన్నపుడు డాక్టర్ కావాలనుకున్నానని.. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల డబ్బు కోసం పక్కదారి పట్టానని ఆమె చెప్పింది.
‘‘చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. మా నాన్న కూడా డాక్టర్ కావడమే అందుకు కారణం. ఐతే ఆయన చనిపోయారు. నేను చదువుతో పాటు మిగతా విషయాల్లోనూ చురుగ్గా ఉండేదాన్ని. నేను మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకునే వరకు కూడా అంతాబానే ఉంది. కానీ 19 ఏళ్లకే గ్లామర్ పిచ్చిలో పడి దారి తప్పాను. డబ్బు కోసం ఓ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నాను. మోడలింగ్ చేసే రోజుల్లో నాకంటే పెద్దవాళ్లతో డేటింగ్ చేసేదాన్ని. వాళ్లు నేను అడక్కుండానే ఖరీదైన బహుమతులు ఇచ్చేవాళ్లు. అలా వారి ఆకర్షణలో పడ్డాను. నిజంగా నన్ను ప్రేమించేవాళ్లు.. గౌరవించేవాళ్లెవరో గుర్తించలేకపోయా. నేను మంచిదానిగా మారాలనుకున్నా.. కానీ మీడియా తప్పుగా మార్చింది’’ అని తన మనోగతాన్ని వెల్లడించింది షెర్లిన్.