నటి షెర్లిన్ చోప్రా బాలీవుడ్ లో పెద్దగా అవకాశాల్ని సొంతం చేసుకోలేకపోయినా బోల్డ్ నటిగా పాపులర్ అయింది. 2012 లో ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్‌పై న్యూడ్ గా ఫోజులిచ్చిన మొదటి భారతీయ నటిగా రికార్డులకెక్కింది. అంతే కాకుండా `కామసూత్ర 3డి`తోనూ షెర్లిన్ దేశ వ్యాప్తంగా ఓ ఊపు ఊపింది. ప్రైవేట్ యాప్ తో యువతని కిర్రెక్కించే ప్రోగ్రామ్ పెట్టుకున్న షెర్లిన్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. నీలిచిత్రాల రాకెట్ కేసులో వ్యాపారవేత్త.. నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. అతని సహచరులకు వ్యతిరేకంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు దాఖలు చేసిన 1467 -పేజీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో 43 మంది సాక్షులలో షెర్లిన్ కూడా ఒకరు.
ఈ కేసు బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పలువురిని ప్రశ్నించిన పోలీసులు తాజాగా శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు. అయితే తను కెరీర్ లో వరుస కమిట్‌మెంట్ లతో బిజీగా ఉండేదాన్నని.. ఆ సమయంలో రాజ్ కుంద్రా ఏమి చేస్తున్నాడో తనకు తెలియదని చెప్పింది. దీనికి ప్రతిస్పందిస్తూ షెర్లిన్ ఒక వీడియోను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. `దీదీ (శిల్పాశెట్టి) తన భర్త అభ్యంతరకర కార్యకలాపాల గురించి తనకు తెలియదని చెబుతోంది. తన భర్త స్థిర ఆస్తుల గురించి తనకు తెలియదని కూడా దీదీ చెబుతోంది. ఈ ప్రకటన ఎంతవరకు నిజమో మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి` అని ఓ వీడియోని విడుదల చేసింది.
రాజ్ కుంద్రా అతని క్రియేటివ్ డైరెక్టర్ తమ మొబైల్ అప్లికేషన్ కోసం పని చేయమని తనని పదేపదే వేధించేవారని షెర్లిన్ కొన్నిరోజుల క్రితం పోలీసులకు వెల్లడించింది. ``నేను షెర్లిన్ చోప్రా యాప్ చేయడానికి ఆర్మ్స్ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ ను నియమించుకున్నాను. ఆర్మ్స్ ప్రైమ్ డైరెక్టర్లు సౌరభ్ కుష్వా .. రాజ్ కుంద్రా`` అని షెర్లిన్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. `హాట్ షాట్` లలోని కంటెంట్ ఊహించలేనంతగా.. అత్యంత అడల్ట్ కంటెంట్ తో ఉంటుంది. కాబట్టి రాజ్ కుంద్రా తనను అందంగా మరింత హాట్ గా కనిపించాలని తనని కోరినట్లు ఈ సందర్భంగా షెర్లిన్ తెలిపింది.
షెర్లిన్ చోప్రా యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్మ్స్ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్,.. షెర్లిన్ సమానంగా వాటాలుగా పంచుకునే విధంగా ప్లాన్ చేసినట్లు కూడా షెర్లిన్ తన వాంగ్మూలంలో పేర్కొంది. అయితే ఇప్పటికీ తన 50 శాతం వాటాను ఎప్పుడూ తాను పొందలేదని పేర్కొన్నారు. అప్పటి నుండి కుంద్రా ఆమెతో కలిసి ఆర్మ్స్ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హాట్ షాట్స్ యాప్ కోసం పని చేయాలనుకున్నాడు. యాప్ లో బోల్డ్ కంటెంట్ వీడియోలు ఎలా ఉంటాయో కూడా వారు నాకు చెప్పారు. కానీ క్రియేటివ్ థాట్స్ కి సంబంధించిన ఒప్పందం డబ్బుల అంశంపై మేము ఒక ఒప్పందానికి రాలేము` హాట్ షాట్స్ లో పనిచేయడానికి రాజ్ కుంద్రా ఆఫర్ ను తిరస్కరించడానికి ఇదే కారణమని షెర్లిన్ చెప్పుకొచ్చింది. రాజ్ కుంద్రాకు సంబంధించిన క్రియేటివ్ డైరెక్టర్ మితా జున్ జున్ వాలా హాట్‌షాట్స్ యాప్ కోసం పని చేయడానికి తనని ఒప్పించడానికి ప్రయత్నించినట్లు షెర్లిన్ తెలపడంతో రాజ్ కుంద్రా చుట్టు ఉచ్చు బిగుస్తోంది.
ఈ వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టిస్తోంది. నీలిచిత్రాల యాప్ ల వ్యవహారం షెర్లిన్ వాంగ్మూలంతో మరింత జఠిలంగా రాజ్ కుంద్రా జీవితాన్ని మరింత చీకటి మయంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోందని.. అది శిల్పాశెట్టి ప్రతిష్టకు మరింత భంగం కలిగించడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు బాహాటంగానే శిల్పాశెట్టి.. రాజ్ కుంద్రాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.