ఫోటో స్టోరి: బికినీలో యాంకర్

Update: 2017-11-18 05:52 GMT
హాట్ బ్యూటీ శివాని దండేకర్ గురించి జనాలకు బాగానే తెలుసు. ముఖ్యంగా క్రికెట్ లవర్స్ కి అయితే.. ఈమెతో బాగా పరిచయం ఎక్కువ. ఐపీఎల్ మ్యాచ్ లలో ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. బ్రేక్ సమయాల్లో కూడా జనాలు టీవీలో ఛానల్ ను మార్చకుండా ఉండేందుకు ఈమె గ్లామర్ ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

టీవీ షోలలో హోస్ట్ గా.. మోడల్ గా.. వీజే గా.. యాంకర్ గా.. యాక్టర్ గా.. ఇలా అనేక రంగాల్లో తన సత్తా చాటుతున్న ఈ భామ.. గ్లామర్ షో విషయంలో కూడా ఏం కాంప్రమైజ్ కాదు. రీసెంట్ గా ఈ భామ తన సోషల్ మీడియా పేజ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇది తాజా ఫోటో ఏమీ కాదు కానీ.. అందులో అమ్మడి అందాలను చూస్తుంటే జనాలు మెస్మరైజ్ అయిపోవడం ఖాయం. గ్లామర్ లవర్స్ ను తెగ మురిపించేస్తున్న ఈ పిక్ లో.. శివాని దండేకర్ ఓ బీచ్ ఒడ్డున రిలాక్స్ అవుతూ కనిపిస్తుంది. అందాలు అన్నిటినీ ఆరబోసేస్తున్న టూ పీస్ బికినీలో.. సముద్రం నీరు ఈమె ఒంటిని తాకీ తాకనట్లుగా ముద్దాడి వెళ్లిపోయే ప్రదేశంలో పడుకుని అమ్మడు ఇచ్చిన పోజ్ కు ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవాల్సిందే.

కొన్ని నెలల క్రితం సమ్మర్ టూర్ లో భాగంగా శివాని దండేకర్ యూరోప్ వెళ్లింది. అప్పటి పిక్ నే ఇప్పుడు షేర్ చేసి.. తను అప్పుడు ఎంతగా ఎంజాయ్ చేసిందో చెబుతోంది ఈ భామ. తెలుగులో తమన్నా హీరోయిన్ గా రూపొందుతున్న క్వీన్ మూవీలో కీలకమైన పాత్రలో కనిపించి.. టాలీవుడ్ ఆడియన్స్ ని త్వరలో పలకరించనుంది శివాని.
Tags:    

Similar News