మాజీ ఐపిఎల్ బ్యూటి రెచ్చిపోతోందిగా..

Update: 2017-04-13 14:19 GMT
2011 నుండి 2015 వరకు ప్రతీ ఐపిఎల్ సీజన్లోనూ ''ఎక్స్ ట్రా ఇన్నింగ్స్'' ను హోస్టింగ్ చేసింది మరాఠి బ్యూటి శిబానీ దండేకర్. అయితే ఈ 35 ఏళ్ళ సెక్సీ సైరన్ ఇప్పుడు ఐపిఎల్ కు దూరంగా ఉంటున్నా కూడా.. ఐపిల్ సీజన్ వస్తే చాలు.. ఆమె గురించి న్యూసులో ఏదో ఒక టాపిక వస్తూనే ఉంటుంది. ఈ నెల మ్యాగ్జిమ్ కవర్ గాళ్ గా అమ్మడు తన సోకులను మరోసారి ఆరబోసిందంటే చూసుకుంటే.. ప్రోగ్రామ్ వదిలేసినా కూడా ఈమెపై క్రేజ్ ఎలా ఉందో.

లండన్ ఆస్ట్రేలియా న్యూయార్క్ లలో పెరిగిన శిబానీ.. ఈ మధ్య కాలంలో తాప్సీ లీడ్ లో వచ్చిన నామ్ షబానా సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది. అయితే ఈ పాటకంటే కూడా ఆమె తన పర్సనల్ సోషల్ మీడియా ఎకౌంట్లోనే ఎక్కువగా అందాలను ఆరబోస్తుంది. ఇప్పుడు మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కు ఇచ్చిన కొత్త షూట్లో కూడా శిబానీ రెచ్చిపోయిందిలే. ఈ షూట్లో తన అందచందాలను విరివిగా ఆరబోసేసింది. అందుకే ఈమె అందానికి కుర్రాళ్లు అలా ఫిదా అయిపోతుంటారు.

వివిధ టివి ఛానల్స్ లో రకరకాల షోలను హోస్ట్ చేస్తున్న శిబానీకి.. మనోళ్ళు తెలుగులో ఏదన్నా ఐటెం నెంబర్ ఇచ్చి తరిస్తేబాగుండు అని చాలామంది టాలీవుడ్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఈ మాజీ ఐపిఎల్‌ గాళ్‌ కు ఎవరైనా అవకాశం ఇస్తారేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News