టాలీవుడ్ లో శిల్పాచౌదరి చీటింగ్ కేసు ఇటీవల హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీ ఇప్పిస్తానని టాలీవుడ్ ప్రముఖుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఎగనామం పెట్టారని దీని వెనక బిగ్ గేమ్ ప్లాన్ నడిచిందని మాదాపూర్ పోలీసులు గుట్టు రట్టు చేసారు. శిల్పా చౌదరి అరెస్ట్ తో టాలీవుడ్ నుంచి బుక్ అయిన ఆ ప్రముఖులు ఎవరు? అన్న ఆరాలు కొనసాగుతున్నాయి. ఈ స్కాంలో ఇరుక్కున్నవారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి..సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని కూడా ఉన్నారని కథనాలొస్తున్నాయి. శిల్పా చౌదరి ఆమె దగ్గర నుంచి 2.9 కోట్లు తీసుకుని మోసం చేసిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. సరిగ్గా శిల్పా చౌదరి అరెస్ట్ అయిన ఐదురోజుల అనంతరం ప్రియదర్శిని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
శిల్పా చౌదరి ప్రతి వారం కిట్టి అనే పేరిట పార్టీలు నిర్వహించడం.. ఆ తర్వాత డబ్బులు తీసుకోవడం అలవాటు అని.. ఆ రకంగాను ప్రియదర్శని దగ్గర నుంచి 2.9 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పోలీసుల కస్టడీలో ఉన్న శిల్పను మరోసారి విచారించి డబ్బు ఎక్కడ దాచిందో అడిగి తెలుసుకుంటామని ప్రియదర్శినికి పోలీసులు చెప్పి పంపించినట్లు తెలుస్తోంది. శిల్పా చౌదరి ఖాతాలో ఇంకెంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు? అన్నదానిపైనా పోలీసుల ఆరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక లిస్ట్ కూడా రెడీ అయ్యిందట. కోట్లాది రూపాయల స్కామ్ స్టర్ గురించిన కథనాలు వేడెక్కిస్తున్నాయి.