ఆ హీరోయిన్లు చిరు జ‌పం చేశారు!

Update: 2015-07-20 06:17 GMT
చిరంజీవి అన్న మాటే ఓ ఆక‌ర్ష‌ణ మంత్రం. వెండితెర పాలిట ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ  ఆయ‌న మెగాస్టారే. బాలీవుడ్‌ లో వుంటూ అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి స్టార్ క‌థానాయ‌కుడు కూడా అందుకోలేనంత రెమ్యున‌రేష‌న్‌ని... టాలీవుడ్‌ లో ఉంటూ చిరంజీవి అందుకొన్నారు. టైమ్స్ మేగ‌జైన్ సైతం  అప్ప‌ట్లో అదే విష‌యాన్ని ప్ర‌క‌టించింది. అంటే...  ఆయ‌న క్రేజ్ ఏ స్థాయిలో సాగిందో  అర్థం చేసుకోవ‌చ్చు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా చిరంజీవి కీర్తిని సంపాదించారు.  రాజకీయాల్లోకి వెళ్లాక ఆ హ‌వా కాస్త త‌గ్గిన‌ట్టు అనిపించింది కానీ... వెండితెర విష‌యంలో మాత్రం నేటికీ వ‌న్నెత‌గ్గ‌ని స్టార్‌. చిరంజీవి ఆక‌ర్ష‌ణ మంత్రానికున్న ప‌వ‌రేంటో, చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌పైనున్న అభిమానం ఏ స్థాయిలో ఉందో టీఎస్సార్ అవార్డ్స్ ఫంక్ష‌న్‌ లో మ‌రోసారి బ‌య‌ట‌పడింది. 

చిరంజీవి... చిరంజీవి... చిరంజీవి. ప్ర‌తి ఒక్క‌రూ ఆ వేడుక‌ లో ఈ పేరే జ‌పించారు. శిల్పాశెట్టి, ర‌వీనాటాండ‌న్‌ లాంటి సీనియ‌ర్ క‌థానాయిక‌లైతే ``మేం చిరంజీవి తో న‌టించ‌లేక‌పోయాం. అదొక్క‌టే భాద‌`` అని చెప్పుకొచ్చారు. అవ‌కాశ‌మిస్తే ఇప్ప‌టికీ మేం రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. ఇద్ద‌రు అంద‌గ‌త్తెలు పోటీప‌డి మ‌రి చిరును పొగుడుతుంటే ప్రేక్ష‌కులు తెగ ఆనంద‌ప‌డిపోయారు. మెగాస్టార్ మెగాస్టారే అని మాట్లాడుకొన్నారు. ఇక 150వ సినిమా సంద‌డి మొద‌ల‌య్యాక‌గానీ ఆ క్రేజ్ మ‌రింత పెరుగుతుంద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. అన్న‌ట్టు అవార్డ్స్ వేడుక‌ లో చిరంజీవి అందంగా క‌నిపించారు. 150వ సినిమాకోసం గ్లామ‌ర్ పెంచుతున్న‌ట్టుగా స్ప‌ష్టంగా క‌నిపించింది.
Tags:    

Similar News