బన్నీ సాంగ్ కి టిక్ టాక్ చేసి అలరించిన బాలీవుడ్‌ హీరోయిన్..!

Update: 2020-06-07 16:46 GMT
దేశంలో వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో కూర్చుని వర్కౌట్స్ చేస్తూ.. వంటా వార్పు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి కూడా తన భర్త కొడుకుతో కలిసి టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవలే శిల్పాశెట్టి భర్తతో కలిసి చేసిన టిక్‌ టాక్‌ వీడియో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వీడియోతో మన ముందుకు వచ్చింది ఈ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి. అయితే ఈసారి టాలీవుడ్ లో ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్ గా నిలిచిన 'సామజవరగమనా' సాంగ్ కి టిక్ టాక్ చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన 'అల వైకుంఠపురంలో' మ్యూజిక్ ఆల్బమ్ ఎంత ఆదరణ పొందిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని 'సామజవరగమనా' 'రాములో రాములా' 'బుట్టబొమ్మా' సాంగ్స్ ఏ రేంజ్ లో అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటలు వచ్చి నాలుగు నెలలు దాటిపోయినా వాటి సందడి మాత్రం ఆగడం లేదు. టిక్ టాక్ వీడియోలతో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ పాటలకి బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్స్ సైతం కాలు కదిపారంటే వాటి రీచ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 'సామజవరగమనా' సాంగ్ పై వేల కొలది కవర్ సాంగ్స్ వచ్చి ఇంటర్నెట్ ని షేక్ చేసాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా శిల్పాశెట్టి కూడా 'సామజవరగమనా' అంటూ టిక్ టాక్ చేసింది. ఈ వీడియోలో తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ పంజాబీ గుజరాతీ హిందీ లాంటి ఏడు భాషల్లో ఉన్న ఈ పాటలకు గొంతు సవరించుకుంది. పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చేసిన ఈ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ సరసన 'సాహస వీరుడు సాగర కన్య'.. మోహన్ బాబుతో కలిసి 'వీడెవడండీ బాబూ'.. కింగ్ నాగార్జునతో కలిసి 'ఆజాద్'.. బాలకృష్ణ సరసన 'భలే వాడివి బాసూ' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది శిల్పాశెట్టి. ఇప్పుడు తెలుగు పాటకి టిక్ టాక్ చేసి మరోసారి తెలుగు ఆడియన్స్ ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News