బాలీవుడ్ సినిమాల్లో పెద్దగా పొడిచిందేమీ లేకున్నా.. బిగ్‌బ్రదర్ షోలో గొడవ పుణ్యమా అని శిల్పాశెట్టి ఉన్నట్లుండి వరల్డ్ ఫ్యామస్ అయిపోయింది. ఇక అప్పట్నుంచి ఆమె సెగలు మామూలుగా లేవు. తానేదో హాలీవుడ్ హీరోయిన్ అయినట్లు శిల్పా ఇచ్చే బిల్డప్పులు చేసి మండిపోతుంటారు బాలీవుడ్ జనాలు. బాలీవుడ్ హీరోయిన్లందరూ లోకల్ అని.. తాను మాత్రం ఇంటర్నేషనల్ అన్నట్లు షో చేస్తూ ఉంటుంది శిల్పా. ఈ మధ్య అమెరికన్ టీవీ సిరీస్ 'ది రాయల్స్' రెండో సీజన్‌లో పాల్గొనమని తనను తెగ ఇబ్బంది పెట్టేశారని.. ఆ షో తనకు బాగా నచ్చడం వల్ల ఓకే చెప్పానని గొప్పగా చెప్పుకుంది శిల్పా.
ఇంతకుముందు ఇదో మంచి అవకాశం అని చెప్పిన నోటితోనే ఇప్పుడు ఆ షోలో పాల్గొనమని ఇచ్చిన ఆఫర్‌ను వద్దన్నట్లు చెప్పింది. కారణమేంటని అడిగితే.. ఆ షోలో పాల్గొంటే తన ముద్దుల కొడుకు వియాన్‌కు ఎక్కువ సమయం కేటాయించలేనని.. అందుకే వద్దనుకున్నానని చెప్పింది. కానీ అసలు కారణం ఏంటంటే.. ముందు తమ ఆఫర్‌ను ఒప్పుకున్న శిల్పా.. డేట్లు కేటాయించే విషయంలో తాత్సారం చేస్తుండటంతో ఆ షో నిర్వాహకులకు మండిపోయిందట. దీంతో మీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం.. మీరిక మమ్మల్ని సంప్రదించాల్సిన పని లేదు.. అని ఖరాఖండిగా చెప్పేశారట. కానీ శిల్పా మాత్రం ఈ విషయాన్ని కవర్ చేసుకుంటూ తనే షో నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకుంటోంది.