స్టైలిష్ లుక్కులో టాలీవుడ్ సాగరకన్య!

Update: 2021-02-04 01:30 GMT
బాలీవుడ్ హీరోయిన్స్ సినిమాలలో ఎంత గ్లామర్ గుప్పిస్తారో బయట కూడా అంతే గ్లామర్ గుప్పించే డ్రెస్సింగ్ స్టయిల్స్ పరిచయం చేస్తుంటారు. ఇండస్ట్రీలో సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్స్ ఫామ్ లో ఉన్నప్పుడు మెయింటైన్ చేసిన ఫిజిక్ మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి సీనియర్ భామలలో ముందుగా ఉంటుంది టాలీవుడ్ సాగరకన్య శిల్పాశెట్టి. తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలే కానీ గుర్తుండిపోయే సినిమాలు చేసింది.

 ఇప్పటికి అమ్మడు ఈ తరం హీరోయిన్స్ కంటే వయ్యారంగా తన సోయగాన్ని మెయింటైన్ చేస్తోంది. సీనియర్ భామలు వయసు పెరుగుతున్నా కొద్దీ తమ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. శిల్పా మాత్రం చక్కని వ్యాయామ నిబంధనలతో శరీరాకృతిని అంతే నాజూకుగా మెయింటైన్ చేస్తుంది.

శిల్పా ఈ తరం హీరోయిన్లకు రోల్ మోడల్ గా తయారైయింది. ఆమెను చూస్తే ఈ కాలం హీరోయిన్స్ కూడా అలా ఉండలేరేమో అనిపిస్తుంది. ప్రస్తుతం బ్యూటిఫుల్ ఫిజిక్ తో సోషల్ మీడియాను ఊపేస్తోంది  ఈ బాలీవుడ్ సుందరి. ఈ నాలుగు పదుల వయసులోనూ కుర్రాకారును తన గ్లామర్ లుక్స్ తో, ఫిజిక్ తో ఆకట్టుకుంటుంది. అన్నట్టు సోషల్ మీడియాలో శిల్పాకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. మిలియన్ల సంఖ్యలో ఫ్యాన్స్ శిల్పా ఫోటోలను లైక్ కొట్టి షేర్ చేస్తుంటారు.

అయితే తాజాగా సోషల్ మీడియా ప్రత్యక్షమైంది శిల్పా. అందులో అమ్మడు ప్యాంటు షర్ట్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. అలాగే సన్ గ్లాసెస్ పెట్టుకొని రెడ్ కలర్ బ్యాగ్ పట్టుకొని దర్శనమిచ్చింది. వాటికీ తోడుగా మ్యాచింగ్ షూ కూడా వేసుకుంది. అందమైన నవ్వుతో మాయ చేస్తోంది శిల్పా. ప్రస్తుతం ఫోటో వైరల్ అవుతోంది.
Tags:    

Similar News