రాజ్ కుంద్రా వివాదం: హంగామా2కు శిల్పాషెట్టి ప్రచారం

Update: 2021-07-24 05:12 GMT
శిల్పాషెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. భర్త ఆ కేసులో చిక్కుకున్న శిల్పా శెట్టి తన రియాలిటీ షోలకు కూడా దూరమైంది. సినిమా ప్రమోషన్లకు హాజరు కాని పరిస్థితి నెలకొంది. 'హంగామా 2' చిత్రం లో శిల్పాషెట్టి కీరోల్ పోషించింది. హంగామా2 చిత్రంలో పరేష్ రావల్ -శిల్పా శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆ సినిమాలో నటించిన శిల్పాషెట్టి ప్రమోషన్ కు హాజరు అవుతారా? లేదా? అన్నది ఆందోళనగా ఉందట.. అయితే తన భర్త వివాదం వల్ల తన మూవీ, కెరీర్ అవకాశాలను కోల్పోవడానికి శిల్పాషెట్టి ఇష్టపడడం లేదట..

శుక్రవారం ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని చూడాలని నెటిజన్లను కోరడానికి నటి శిల్పాషెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లింది. 'హంగామా 2' మొత్తం టీం మిమ్మలను కడుపుబ్బా నవ్విస్తుందని.. ఈ సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడ్డామని.. ఈ చిత్రం తన వల్ల దెబ్బతినకూడదని.. అందరూ చూడాలని’ ఆమె కోరారు. తన వ్యక్తిగత సమస్యల నుంచి ‘హంగామా2’ను వేరుగా చూడండని.. నెటిజన్లు ఆ సినిమాపై కామెంట్ నెగెటివ్ ప్రచారం చేయవద్దని శిల్పా కోరారు. హంగామా2ను తనతో పోల్చవద్దని.. విడిచిపెట్టాలని విన్నవించారు.

"నేను యోగా బోధనలను నమ్ముతున్నాను. ఆచరిస్తున్నాను. జీవితం ఉన్న ఏకైక ప్రదేశం ప్రస్తుత క్షణం, ఇప్పుడు దాన్ని ఆస్వాదించాలని" అని నటి శిల్పాశెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. "హంగమా 2 వంటి మంచి చిత్రం చేయడానికి చాలా కష్టపడి పనిచేసిన మొత్తం టీంకు అభినందనలు. వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ చిత్రం హిట్ కావాలని ఆశిస్తున్నాను " అని శిల్పా శెట్టి అభిప్రాయపడ్డారు.

తన చిత్రం చూడాలని తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను శిల్పాశెట్టి అభ్యర్థించారు. ఈ మేరకు రెండు చేతులు జోడించిన ఎమోజీని పోస్ట్ చేసి ఇలా చెప్పింది: "ఈ రోజు మీ ముఖం మీద చిరునవ్వు చూడడానికి.. ప్రతి ఒక్క వ్యక్తి కోసమే మీ కుటుంబాలతో కలిసి హంగామా 2 చూడాలని సినిమా తీశాం. ఈ సినిమా చూడాలని మీ అందరినీ కోరుతున్నాను." అని శిల్పాషెట్టి ముగించింది.




Tags:    

Similar News