స్టార్ కి ఏ మాత్రం త‌గ్గ‌ని శిల్పాశెట్టి వ్యానిటీ!

Update: 2022-06-09 11:30 GMT
శిల్పాశెట్టినా..మ‌జాకానా! అవును. అమ్మ‌డు ఏం చేసినా అలాగే ఉంటుంది. రేంజ్ లో ఏమాత్రం త‌గ్గ‌దు. చేతిలో  సినిమాలున్నా..లేక‌పోయినా ఒకే ర‌క‌మైన ఛ‌రిష్మాతో గెట్ ఇన్ అవ్వ‌డం శిల్పాశెట్టికే చెల్లింది.  అందుబాటులో ఉన్న సోష‌ల్ మీడియాని...టీవీషోల‌ను వెపన్స్ లా వినియోగించుకుని క్రేజ్ లో స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

సొగ‌స‌రి ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ సంఖ్య చూస్తే అది స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది. 50 ఏళ్ల‌కు చేరువ‌లో ఉన్నా.. బిడ్డ‌కు త‌ల్లైనా...ఓ భ‌ర్త‌కు భార్య అయినా శిల్పా శెట్టి ఫాలోయింగ్ ఎక్క‌డా కింగ‌లేదు. నిత్యం యోగా..జిమ్....ప‌ర్పెక్ట్ డైట్ ప్లాన్ చేసుకుని రంగుల  పోటీ ప్ర‌పంచంలో మును ముందుకు దూసుకుపోతుంది.  ఇక నిన్నిటి రోజున   శిల్పాశెట్టి పుట్టిన రోజు వేడుక‌లు సైతం ఎంతో ఘ‌నంగా జ‌రిగాయి.

అభిమానులు  అమ్మ‌డిని ఇంటి ముందే స‌ర్ ప్రైజ్ చేసారు. దండోరా గా అభిమానులంతా గుంపుగా శిల్పాశెట్టి ఇంటి ముదుకొచ్చి బ్యాండ్   వాయిస్తూ విషెస్ చెప్ప‌డం మొద‌లు పెట్టారు. గ‌దిలోప‌ల ఉన్న శిల్పా శెట్ట‌లి ఆ శ‌బ్ధం ఏంట‌ని చూడ‌టానికి బ‌య‌ట‌కు వ‌చ్చి షాక్ అయింది. త‌న‌కోసమే అభిమానులంతా విషెస్ చెప్ప‌డానికి వ‌చ్చార‌ని సంతొష ప‌డింది...సంబంరంతో ఎగిరి గంతేసింది.

వాళ్ల‌తో  పాటు ఓ స్టెప్ ని పంచుకుంది. ఎప్ప‌టికీ గుర్తుండిపోయే  ది బెస్ట్ ..బ్యూటీ ఫుల్ బ‌ర్త్ డే అంటూ చెప్పుకొచ్చింది.  ఈ సంద‌ర్భంగా త‌న‌కు తానుగానే ఓ ల‌గ్జ‌రీ బ‌హుమ‌తిని బ‌హుక‌రించుకుంది. పుట్టిన రోజు సంద‌ర్భంగా ల‌గ్జరీ వ్యానిటీని కొనుగోలు చేసింది.  పాత వ్యానిటీని ప‌క్క‌న‌బెడేసి అప్ డేట్ అవ్వాలంటూ న్యూ వెర్ష‌న్ వ్యానిటీ కొనుక్కుంది.

ఈ వ్యానిటీ 5 స్టార్ హోట‌ల్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంది. ఈ బ్లాక్ క‌ల‌ర్ వ్యానిటీలో  స‌క‌ల సౌక‌ర్యాలున్నాయి. కిచెన్..హెయిర్ వాష్ రూమ్.. యోగా డెక్.. స‌ప‌రేట్ గా రిలాక్స్ అవ్వ‌డానికి అద్భుత‌మైన గ‌ది ఇందులో ఉన్నాయి.  ఆ వ్యానిటీ ప్యూచ‌ర్స్ సైతం ఎంతో అప్ డేట్ గా ఉన్నాయ‌ట‌. ఇక వ్యానిటీ ముందు భాగంలో ఎస్ ఎస్ కే అని రాసి ఉంది.

ఇన్ని సౌక‌ర్యాలు  ఉన్నాయంటే దీని ధ‌ర కోట్ల‌లోనే ఉంటుంద‌ని చెప్పొచ్చు.  ఎన్నికోట్లైనా వెచ్చించ‌గల స‌మ‌ర్ధురాలే కాబ‌ట్టి మ‌నీ మ్యాట‌ర్ కాదు. ఇక శిల్పా శెట్టి సినిమాల విష‌యానికి వ‌స్తే ఆమె న‌టించిన‌  'నిక‌మ్మ' చిత్రం జూన్ 17న రిలీజ్ అవుతుంది.  అలాగే రోహిత్ శెట్టి తెర‌కెక్కిస్తున్న  'ఇండియ‌న్ పోలీస్ పోర్స్'  అనే వెబ్ సిరీస్ తో  ఓటీటీ వ‌ర‌ల్డ్ లో కి అడుగు పెడుతుంది.


Full View

Tags:    

Similar News