శిరీష్ పిల్లలు హిందువులా.. ముస్లింలా?

Update: 2017-01-06 06:09 GMT
మతం.. ప్రపంచంలో దీని చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. పరమత సహనం అనే మాట వినిపిస్తూనే ఉంటుంది కానీ.. మధ్యమధ్యలో అసహనం లాంటివి కూడా వినక తప్పని పరిస్థితి. ఇప్పుడిప్పుడే సమాజంలో కొంత మార్పు వస్తూ ఉండగా.. కులాంతర మతాంతర వివాహాలు కూడా ఊపందుకుంటున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఇలా మతాంతర వివాహాలు చేసుకున్నవారు చాలా మందే కనిపిస్తారు. అందులో ఒక జంట శిరీష్ కుందర్- ఫరాఖాన్.

శిరీష్ హిందువు కాగా.. ఆయన భార్య ఫరా ముస్లిం అనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకులు అయిన ఈ జంటగా తాజాగా తమ పిల్లలతో కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ఓ నెటిజన్ 'మీ పిల్లలు హిందువులా? ముస్లిమ్ లా?' అంటూ శిరీష్ ని అడిగాడు. దానికి ఈ దర్శకుడు ఇచ్చిన సమాధానం నిజంగా చెప్పుదెబ్బ లాంటిదని చెప్పాల్సిందే.

'అది పండగలపై ఆధారపడి ఉంటుంది. పండగ ఏదైతే మా పిల్లలది అదే మతం. చివరగా క్రిస్మస్ పండగ కాబట్టి... మా పిల్లలు క్రిస్టియన్స్' అంటూ శిరీష్ ఇచ్చిన ఆన్సర్.. ఎంతో మందిని కదిలించేసింది. సినిమాల్లో వివాదాలు చూపించడం ఈ దర్శకుడికి సాధారణం అయినా.. నిజ జీవితంలో మాత్రం 12 వీళ్ల అన్యోన్య దాంపత్యానికి.. పరమత సహనానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News