శివసేన వేడి బాద్షాకి తగులుద్దేమో?

Update: 2015-10-21 15:30 GMT
పాకిస్తాన్ వాసనలు ఉంటే చాలు.. అడ్డు పడతామంతే.. ఇదీ శివసేన లెక్క. మొన్నటికి మొన్న రచయిత సుధీంద్ర కులకర్ణిపై బ్లాక్ పెయింట్ పోశారు. అంతకు ముందు గులాం ఆలీ కచేరీని అడ్డుకున్నారు. దానికి ముందు ముంబైలో పాక్ ప్లేయర్లు ఆడే క్రికెట్ మ్యాచ్ లను జరగనీయబోమని ఖరాఖండీగా చెప్పేసింది సేన.

కళాకారులను వదిలేయమంటే.. అబ్బెబ్బే అలాగేం కుదరదు.. పాక్ వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లు కనపిస్తే అడ్డుకోవడం ఖాయమని తేల్చేశారు శివసేన నాయకులు. చూస్తుంటే ఇప్పుడీ వేడి బాలీవుడ్ కి బాగానే తాకేట్లుగా ఉంది. ముఖ్యంగా షారూక్ ఖాన్ కి మంట అంటించేట్లుగా కనిపిస్తోంది.

వచ్చే ఏడాది రంజాన్ కి రాయీస్ ని రిలీజ్ చేయబోతున్నాడు షారూక్ ఖాన్. ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది పాకిస్తాన్ స్టార్ మహిరా ఖాన్. మరి ఎస్ఆర్కే నటించిన మూవీని ముంబైలో విడుదల కానిస్తుందా శివసేన అన్నదే ఇప్పుడు డౌట్. గతంలోనూ శివసేనతో షారూక్ కొన్ని తలనొప్పులు ఎదుర్కున్నాడు. ఐపీఎల్ మ్యాచుల్లో పాక్ ప్లేయర్లు ఉండాలని అనడంతో.. మై నేమ్ ఈజ్ ఖాన్ ని.. ముంబైలో ప్రదర్శించకుండా అడ్డపడ్డారు శివసేన కార్యకర్తలు. ఈ ప్రభావం కలెక్షన్లపై బాగానే కనిపించింది.

షారూక్ నటిస్తున్న రాయీస్ ఒక్కటే కాదు.. మరికొన్ని మూవీస్ కూడా శివసేన గురించి ఆందోళన చెందుతున్నాయి. ఫవాద్ ఖాన్ తెరకెక్కిస్తున్న కపూర్ అండ్ సన్స్, ఏ దిల్ హై ముష్కిల్ కూడా ఇబ్బందులు పడ్డం ఖాయంగానే కనిపిస్తోంది.
Tags:    

Similar News