ఆ రోజు డమ్మీ తుపాకీ శ్రీదేవిని కాపాడినది

Update: 2020-08-04 01:30 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ కెరీర్‌ ఆరంభంలో తీసిన చిత్రాల్లో చాలా వరకు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాయి. అప్పుడు ఆయన వర్క్‌ పట్ల చాలా నిబద్దతతో ఉండే వారు. ఆయన తీసిన క్షణం క్షణం గురించి ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను వర్మ వివరించాడు. అయితే ఈసారి ఆ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఆ చిత్రానికి కో డైరెక్టర్‌ గా చేసిన శివ నాగేశ్వరరావు షేర్‌ చేశాడు. శ్రీదేవికి క్షణం క్షణం సినిమాకే స్టార్‌డం ఉంది. ఆమె పట్ల అభిమానులు పిచ్చొల్ల మాదిరిగా వ్యవహరించే వారు. ఆమె ఎక్కడ షూటింగ్‌ లో పాల్గొంటుందని తెలిసినా కూడా అక్కడ వందల సంఖ్యలో జనాలు పోగయ్యేవారు.

క్షణం క్షణం సినిమాలోని రైలు సీన్‌ కోసం నంద్యాల నుండి దిగువమెట్ట వరకు రైలులో ప్రయాణించి మరీ చిత్రీకరణ చేశాం. ఆమద్యలో రైలు ఎక్కడ ఆగకుండా షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా సాగేది. రెండు రోజులు షూటింగ్‌ చేశాం. దిగువమెట్ట వద్ద రైలు దిగి కారులో అక్కడ నుండి వెళ్లి పోవాల్సి ఉంటుంది. మొదటి రోజు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. కాని రెండవ రోజు శ్రీదేవి గారు దిగువమెట్ట రైల్వే స్టేషన్‌ లో దిగుతున్నట్లుగా స్థానికులకు తెలిసింది. దాంతో షూటింగ్‌ పూర్తి అయ్యే సమయానికి వందల సంఖ్యలో అక్కడకు చేరారు. శ్రీదేవి రైలు దిగక ముందే వారు అంతా కూడా రైలు ఎక్కేశారు.

శ్రీదేవి రైలు దిగి కారు ఎక్కడం ఎలా అంటూ చర్చ జరుగుతున్న సమయంలో నేను ప్లాట్‌ ఫామ్‌ పై ఒక టవల్‌ పై ఉన్న తుపాకీని చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఉత్తేజ్‌ ను కూడా ఏమీ మాట్లాడకుండా ఆ తుపాకీనే చూస్తూ ఉండమని చెప్పాను. మేము ఇద్దరం కూడా ఆ తుపాకీని తీక్షణంగా చూస్తూ ఉండటంను మరికొందరు గమనించి వచ్చి వారు కూడా తుపాకీని చూడసాగారు. అలా చాలా మంది తుపాకీ చుట్టు పరిశీలనగా చూశారు. ఆ సమయంలో శ్రీదేవి మెల్లగా రైలు దిగి కారు ఎక్కేశారు. ఆ విషయం నాకు తెలిసిన వెంటనే ఆ డమ్మీ తుపాకీని చేతిలోకి తీసుకుని టవల్‌ ను బుజాన వేసుకుని అక్కడ నుండి వెళ్లి పోయాను అంటూ అప్పటి జ్ఞాపకాలను శివ నాగేశ్వరరావు షేర్‌ చేసుకున్నారు.
Tags:    

Similar News