మజిలీకి వస్తున్న రెస్పాన్స్ యూనిట్ కే కాదు అభిమానులకు సైతం హ్యాపీ న్యూస్ గా నిలిచింది. ఏ రేంజ్ హిట్ అని చెప్పడం తొందపాటు చర్య అవుతుంది కానీ ఈ మూడు సెలవులు అయ్యాక వీక్ డేస్ కలెక్షన్స్ ని ఎలా రాబడుతుంది అనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ని డిసైడ్ చేయొచ్చు. ఇక పోతే శివ నిర్వాణ విషయంలో చైతు ఫాన్స్ టెన్షన్ పడిన అంశం ఒకటే. ఇది తనకు రెండో సినిమా.
సాధారణంగా తొంభై శాతం టాలీవుడ్ డెబ్యూ డైరెక్టర్లకు రెండో ప్రాజెక్ట్ సక్సెస్ కాలేని దాఖలాలే ఎక్కువ. ఓ ఐదుగురు ఇందులో నుంచి మినహాయించబడ్డారు కానీ ఈ ద్వితీయ విఘ్నం గండం బారిన పడిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అందుకే నిన్ను కోరి లాంటి హిట్ మూవీ తర్వాత శివ నిర్వాణ చేసిన మూవీ కాబట్టి అనుమానాలు రావడం సహజం. అయితే ఇప్పటిదాకా వచ్చిన టాక్ ని బట్టి చూస్తే శివ నిర్వాణ ఈ గండాన్ని దాటేసినట్టే అనుకోవచ్చు.
షూటింగ్ ప్రారంభం నుంచి ప్రీ రిలీజ్ దాకా శివ ఒకరకమైన రిజర్వ్డ్ సైలెన్స్ మైంటైన్ చేశాడు. తన కంటే ఎక్కువ సినిమా మాట్లాడాలి అనే ఉద్దేశంతో అధిక శాతం మౌనాన్నే ప్రదర్శించాడు. కానీ ఇప్పుడు నిజంగానే రిజల్ట్ మాట్లాడుతోంది. ఓ మాములు కథను తనదైన ఎమోషనల్ ట్రీట్మెంట్ తో శివ నిర్వాణ నిలబెట్టిన తీరు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతోంది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం థమన్ ని ఎంచుకోవడం కథను బట్టి చైతు సామ్ లాంటి రియల్ లైఫ్ కపుల్ నిసెలెక్ట్ చేసుకోవడం తన కలం బలంతో సన్నివేశాలను నిలబెట్టడం లాంటివి విజయవంతం అయ్యేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడు మజిలీ ఏ తీరానికి చేరుతుంది అనే దాన్ని బట్టి చైతు కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందా లేదా డిసైడ్ అవుతుంది. దానికి ఇంకొంత కాలం వేచి చూడటం అవసరం