కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాత్ మరణం నుండి అభిమానులు మెల్ల మెల్లగా బయటకు వస్తున్నారు. చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ మృతి చెందడంను ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసి ఎంతో మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. చాలా మంది అభిమానులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతటి అభిమానం దక్కించుకున్న పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా తో ఆయనకు ఘన నివాళి సమర్పించాలని ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్. పునీత్ మృతి చెందడానికి ముందే జేమ్స్ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేశారు. మార్చి లో ఆయన జయంతి సందర్భంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
జేమ్స్ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు అయితే ఏదోలా పూర్తి చేశారు కాని పునీత్ రాజ్ కుమార్ పాత్రకు డబ్బింగ్ విషయంలో చాలా కసరత్తు జరిగింది. ఆయన ఆన్ లొకేషన్ చెప్పిన డైలాగ్ లను అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కంటిన్యూ చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ తప్పనిసరి అయ్యింది. దాంతో మిమిక్రీ ఆర్టిస్టులతో ప్రయత్నించారు.. కొందరు డబ్బింగ్ ఆర్టిస్టులను ప్రయత్నించారు. కాని వర్కౌట్ కాలేదు. కాస్త అటు ఇటు అయితే మొత్తం తేడా కొట్టడమే కాకుండా పునీత్ రాజ్ కుమార్ అభిమానుల మనోభావాలు దెబ్బ తీసిన వాళ్లం అవుతామనే ఉద్దేశ్యంతో నిర్మాతలు డబ్బింగ్ విషయంలో ప్రయోగాలు వద్దు అనుకుని ఆయన అన్న అయిన శివ రాజ్ కుమార్ తో చెప్పించేందుకు సిద్దం అయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ అవ్వడం వల్ల శివరాజ్ కుమార్ మరియు మరో సోదరుడు అయిన రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. వీరిద్దరు గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ పాత్రకు శివ రాజ్ కుమార్ తాజాగా డబ్బింగ్ చెప్పాడట. డబ్బింగ్ చెబుతున్న సమయంలో శివ రాజ్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని తాను భావించలేదని శివ రాజ్ కుమార్ అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శివ రాజ్ కుమార్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పునీత్ ను అలా చూస్తూ డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. పలు సందర్బాల్లో ఎమోషనల్ అయ్యాను అన్నాడు. జేమ్స్ సినిమా కు శివ రాజ్ కుమార్ డబ్బింగ్ ప్రథాన ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.