కెమెరామన్ టర్న్డ్ డైరెక్టర్ శివ గుర్తున్నాడు కదా. దర్శకుడిగా అతడికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది టాలీవుడ్డే. మన గోపీచంద్ తో తీసిన ‘శౌర్యం’ డైరెక్టర్ గా అతడి తొలి సినిమా. ఆ సినిమా మంచి విజయమే సాధించింది. కానీ ఆ తర్వాత తెలుగులో తీసిన రెండు సినిమాలూ అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శంఖం - దరువు ఫ్లాపయ్యాయి. ఐతే తమిళంలో మాత్రం అతను దూసుకెళ్తున్నాడు.
ముందు రాజమౌళి తీసిన ‘విక్రమార్కుడు’ సినిమాను కార్తి హీరోగా ‘సిరుత్తై’ పేరుతో రీమేక్ చేసి అక్కడ తొలి విజయాన్నందుకున్నాడు శివ. ఈ సినిమాతో అతడికి ‘సిరుత్తై శివ’గా పేరు తెచ్చుకున్నాడతను. దీని తర్వాత అజిత్ లాంటి పెద్ద హీరోతో తీసిన ‘వీరం’ గత ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్టయింది. దీంతో శివకు మరో ఛాన్స్ ఇచ్చాడు అజిత్.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొత్త సినిమా ‘వేదాలం’ దీపావళికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తోంది. తొలి రోజే రూ.15 కోట్ల దాకా వసూలు చేసి కోలీవుడ్ లో రికార్డు నెలకొల్పిన ఈ సినిమా వంద కోట్ల మార్కును అందుకుంటుందన్న అంచనాలున్నాయి. మొత్తానికి హ్యాట్రిక్ హిట్లతో తమిళనాట మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు శివ.