న‌రేశ్ బ్యాచ్ పై శివాజీరాజా గుస్సా!

Update: 2019-03-19 10:07 GMT
'మా'లో రేగిన చిచ్చు ఆర‌టం లేదు. ఎన్నిక‌ల వేళ రెండు వ‌ర్గాలుగా మా చీల‌టం.. ఆ త‌ర్వాత వారి మ‌ధ్య వివాదం స‌మిసిపోవ‌టం చూస్తున్న‌దే. ఈసారి అందుకు భిన్నంగా రెండు వ‌ర్గాల మ‌ధ్య ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో వాతావ‌ర‌ణం అంత‌కంత‌కూ వేడెక్కుతోంది. వివాదం ముదురుతోంది. ఈ మ‌ధ్య జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో న‌రేశ్ ప్యాన‌ల్  చేతిలో శివాజీ రాజా  ప్యాన‌ల్ ఓడిపోవ‌టం తెలిసిందే.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత‌.. త‌మ మ‌ధ్య స్ప‌ర్థ‌ల‌న్నీ ఎన్నిక‌ల వ‌ర‌కేన‌ని.. ఆ త‌ర్వాత తామంతా ఒకే కుటుంబంగా న‌రేశ్ వ‌ర్గీయులు వ్యాఖ్యానించ‌టంతో వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ఎన్నిక‌ల వివాదం స‌మిసిపోతుంద‌ని భావించారు. అయితే.. అందుకు భిన్నంగా న‌రేశ్ టీం తెర మీద‌కు వ‌చ్చి.. శివాజీరాజా త‌మ‌ను ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌కుండా అడ్డుకుంటున్నార‌ని.. ఒక‌వేళ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తే తాను కోర్టుకు వెళ‌తాన‌ని చెప్పారంటూ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఈ వ్యాఖ్య‌ల‌పై కాస్త ఆల‌స్యంగా స్పందించారు శివాజీరాజా. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కోర్టుకు వెళ‌తాన‌ని చెప్పిన మాట‌ల్లో నిజం లేద‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో వివాదానికి తెర ప‌డుతుంద‌ని భావించినా అలా జ‌ర‌గ‌టం లేద‌ని.. తాను గెలిచిన స‌మ‌యంలోనూ గ‌డువు ముగిసే వ‌ర‌కూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు తాను వెయిట్ చేసిన విష‌యాన్ని వెల్ల‌డించారు.

అంతేకాదు.. గ‌తంలో త‌న మీద చేసిన ప‌లు ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ‌తంలో మా చాలా బాగుండేద‌ని.. నాలుగేళ్లుగా రాజ‌కీయాలు ప్ర‌వేశించాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డిచిన 22 ఏళ్లుగా మాలో ఎన్నో ప‌ద‌వుల్లో తాను సేవ చేశాన‌ని.. ఈసీ మెంబ‌ర్ నుంచి అధ్యక్షుడి వ‌ర‌కూ అన్ని బాధ్య‌త‌లు చేప‌ట్టాన‌న్నారు.

త‌న‌కు కుర్చీ మీద వ్యామోహం లేద‌ని.. కానీ న‌రేశ్ వ‌ర్గం ప్రెస్ మీట్ పెట్టి త‌మ ప‌రువు తీయ‌టం బాధ క‌లిగించిన‌ట్లుగా చెప్పారు. ఈ కార‌ణంతోనే తాను ప్రెస్ మీట్ పెట్టిన‌ట్లుగా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌పై న‌రేశ్ వ‌ర్గం చేసిన కొన్ని ఆరోప‌ణ‌ల‌కు ఆయ‌న క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఆరోప‌ణ 1: అమెరికా ఈవెంట్ సంద‌ర్భంగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి

శివాజీరాజా క్లారిటీ:  ఈ ఈవెంట్ పై చిరంజీవి అధ్య‌క్ష‌త‌న వేసిన క‌మిటీ క్లీన్ చిట్ ఇచ్చింది

ఆరోప‌ణ 2: ఈవెంట్ సంద‌ర్భంగా ఫిలిం స్టార్స్ ను బిజినెస్ క్లాస్ లో తీసుకెళ్లారు
శివాజీరాజా క్లారిటీ: త‌మిళ న‌టీన‌టుల సంఘానికి చెందిన ఈవెంట్ లో న‌రేశ్  బిజినెస్ క్లాస్ లో వెళ్లి.. సూట్ రూమ్ లో స్టే చేశారు. తార‌ల‌కు స‌ముచిత గౌర‌వం ఇవ్వ‌టం ధ‌ర్మం. అందుకే బిజినెస్ క్లాస్ ల్లో తీసుకెళ్లాం.

ఆరోప‌ణ‌3: ప‌్ర‌తీసారి మా అమ్మ విజ‌య‌నిర్మ‌ల రూ.15వేలు ఇస్తున్నారు
శివాజీరాజా క్లారిటీ:  రూ.15వేల‌తోనే మా న‌డుస్తుందా?

ఆరోప‌ణ 4:  శ్రీ‌రెడ్డి.. డ్ర‌గ్స్ ఇష్యూలో స‌రిగా స్పందించ‌లేద‌ని జీవిత గ‌తంలో అడిగారు.
శివాజీరాజా క్లారిటీ: శ్రీ‌రెడ్డి విష‌యంలో కార్డు ఇవ్వాల‌ని కొంద‌రు.. ఇవ్వొద్ద‌ని కొంద‌ర‌న్నారు. అందుకే ఆ టైంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోలేదు.

ఇలా త‌న మీద ఆరోప‌ణ‌లు చేసిన వాటిపై క్లారిటీ ఇచ్చిన శివాజీరాజా న‌రేశ్ బ్యాచ్ పై స‌రికొత్త ఆరోప‌ణ‌లు చేశారు. మంట పుట్టేలా వ్యాఖ్యానించారు.

శివాజీరాజా విమ‌ర్శ 1: ఎన్నిక‌ల వేళ నారాయ‌ణ‌రావు అనే వ్య‌క్తి జీవిత‌కు ఓటేయాల‌ని మైకులో చెప్పారు. మేమేమీ  అన‌లేదు.

శివాజీరాజా విమ‌ర్శ 2:  జీవితా రాజ‌శేఖ‌ర్ లు అన్ని పార్టీలు మారారు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మీద ప‌డ్డారు.

శివాజీరాజా విమ‌ర్శ 3:  మా డైరీ ప్రింటింగ్ స‌మ‌యంలో న‌రేశ్‌.. ఈసారి ప్రింటింగ్ చేయిస్తాన‌ని బాధ్య‌త తీసుకున్నాడు. రూ.14ల‌క్ష‌లు ప్రింటింగ్ కోసం క‌లెక్ట్ చేసినట్లు చెప్పారు. కానీ.. అకౌంట్ లో రూ.7ల‌క్ష‌లే జ‌మ చేశారు. మిగిలిన రూ.7ల‌క్ష‌లు ఏమ‌య్యాయి? ఎప్పుడు వ‌స్తాయి?

శివాజీరాజా విమ‌ర్శ 4: డైరీ  ప‌్రింటింగ్ కోసం వ‌సూలు చేసిన రూ.7ల‌క్ష‌లు జ‌మ చేసిన త‌ర్వాత ప్ర‌మాణ‌స్వీకారం చేస్తే బాగుంటుంది. త‌ప్పులు చేసిన వాళ్లు అవ‌త‌ల వాళ్ల‌ను వేద‌న‌కు గురి చేయ‌టం స‌రికాదు.


    

Tags:    

Similar News