కామెడీ బేస్..నర్తనశాలలో కళామందిర్ కళ్యాణ్

Update: 2018-08-21 05:52 GMT
కళామందిర్.. హైదరాబాద్ లోని ఫేమస్ వస్త్రాల దుకాణం.. ఆ తర్వాత వివిధ పట్టణాలకు కూడా విస్తరించింది. ఈ దుకాణాల నిర్వహణ చూసే కీలక భాగస్వామి పేరు కళ్యాణ్. ఈయనకు సినిమాలతో అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది సీనీ జనాలకు కళ్యాన్ సన్నిహితుడు.. సినిమా షూటింగ్ లకు - ప్రచారానికి ఈయన వీలైనంత సాయం చేస్తుంటాడు. అలాగే సినిమా ఫంక్షన్ లకు స్పాన్సరర్ గా వ్యవహరిస్తుంటాడు. అందుకే తెలుగు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులంతా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తుంటే కళామందిర్ కళ్యాణ్ ను అందులో భాగస్వామిగా చేస్తారు..

అంతటి చిరపరిచితమైన కళ్యాణ్ ను బేస్ చేసుకొని ఇప్పుడు ‘నర్తనశాల’ అనే మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో సరదా కోసమో.. లేక కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకొని రూపొందించారో తెలియదు కానీ.. ‘కళామందిర్ కళ్యాణ్’ అనే క్యారెక్టర్ ను మాత్రం సృష్టించారు. ఈ మూవీలో హీరోగా చేస్తున్న నాగశౌర్య కు తండ్రిగా శివాజీ రాజా కనిపిస్తాడు. ఆ శివాజీ క్యారెక్టర్ పేరే కళామందిర్ కళ్యాణ్.

సినిమాలో కామెడీని పండించే ఈ పాత్రలో శివాజీ రాజా బాగా నటించాడట.. ఈ పాత్ర జనాలకు బాగా నచ్చుతుందని సినిమా యూనిట్ చెబుతోంది. అయితే   పారిశ్రామికవేత్తను అయిన తనను ఊహించుకొని తొలిసారి ఓ పాత్ర సృష్టించడం.. దాన్ని శివాజీ రాజా చేయడంపై  కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశాడట.. తన అన్ని ‘కళామందిర్’ షోరూంలలోనూ నర్తనశాల టీజర్లు - సాంగ్ లు - బ్రాడ్ కాస్ట్ ను చేసి సినిమాకు తనవంతుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడట.. ఇలా చిరపరిచితమైన కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సినీ వర్గాల్లోనూ నెలకొంది.
Tags:    

Similar News