సావిత్రక్క ప్రేమకథ.. సో ఎమోషనల్

Update: 2020-06-14 04:02 GMT
సావిత్రక్క అలియాస్ శివజ్యోతి ప్రేమకథ హారిబుల్ గా ఉంది. శివజ్యోతి భర్త గంగూలీని పోలీసులకు పట్టించడం.. శివజ్యోతిని నిర్బంధించి కొట్టడం.. అబ్బో వీరి ప్రేమ కథ విజయ తీరాలకు చేరేసరికి ఎన్నో కష్టాలు - కడగండ్లు ఉన్నాయి. ఎంతో కష్టపడి ఇంత స్థాయికి ఎదిగింది ఈ తీన్మార్ సావిత్రి. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి శివజ్యోతిగా తెలుగు ప్రజల హృదయాలు కొల్లగొట్టిన ఈమె నెత్తిన కన్నీటి కుండను పెట్టుకొని అందరికీ అక్కగా మారింది.

సావిత్ర స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం నాగంపేట్ గ్రామం.చిన్నప్పటి నుంచి కళలు, సాహిత్యం మీద శివజ్యోతికి మక్కువ ఎక్కువట.. పదోతరగతి వరకు చదివే సమయంలోనే శివజ్యోతికి తన క్లాస్ మేట్ అయిన గంగూలీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరిదీ ఒకే ఊరు. కలిసి చదివారు. ఇంటర్ వేరుగా చదివారు. తర్వాత నర్సింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు శివజ్యోతితో గంగూలీ దగ్గరయ్యాడట..

చదువు మానేసి ఇంటికెళ్లక ఫోన్లో వీరి ప్రేమ పీక్స్ లోకి వెళ్లింది. వీరి వ్యవహారం ఇంట్లో తెలిసి దొరికిపోయారు. శివజ్యోతి తల్లిదండ్రులు గంగూలీని పోలీసులకు పట్టించారట.. శివజ్యోతి బాగా కొట్టారట..

తను ఇష్టపడ్డ గంగూలీ పోలీస్ స్టేషన్ పాలుకావడంతో ఇంట్లో నుంచి గంగూలీతో హైదరాబాద్ పారిపోయింది శివజ్యోతి. చదువు మానేసి శివజ్యోతిని హాస్టల్ లో పెట్టి దాదాపు ఏడాదిన్నరపాటు గంగూలీనే అన్నీ తానై చూసుకున్నాడట..  తర్వాత రిసెప్షినిస్టుగా చేరి తర్వాత న్యూస్ యాంకర్ గా మారి.. తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి అందరికీ పాపులర్ అయ్యింది . ఈ  క్రమంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. శివజ్యోతి. ఇలా తన ప్రేమలో ఎన్నో ఇబ్బందులు.. జీవితంలో కడగండ్లతో ఎమోషనల్ జర్నీని చవిచూసింది.


Tags:    

Similar News