తమిళ హీరో సూర్య నాన్నగారు శివకుమార్ ఈమధ్య ఒక వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో ఒక షాప్ ఓపెనింగ్ కు హాజరయిన శివకుమార్ రిబ్బన్ కటింగ్ చేసేందుకు కొద్ది క్షణాల ముందు కోపంతో ఒక అభిమాని ఫోన్ ను లాక్కొని నేలకేసి కొట్టాడు. ఇంతకీ ఆ అభిమాని చేసిన నేరం ఏంటంటే అత్యుత్సాహంతో శివకుమార్ తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడం.
ఈ సంఘటన కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం.. శివకుమార్ దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలుపెట్టాడు. ఆ అభిమానికి శివకుమార్ సారీ చెప్పడమే కాకుండా ఓ కొత్త ఫోన్ కూడా కొనిచ్చాడట. ఇదిలా ఉంటే ఈ విషయం పై ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశాడు. "నేను వేదిక వద్దకు వెళ్ళిన సమయంలో జనాలు వాలంటీర్స్ ని నెట్టేస్తున్నారు.. నిర్వాహకులను ఇబ్బందిపెడుతున్నారు. కానీ నేను కామ్ గానే ఉన్నాను. అయినా అందరూ నాది తప్పని అంటే మాత్రం అందుకు చింతిస్తున్నాను" అన్నాడు.
ఇదిలా ఉంటే.. శివకుమార్ దురుసు ప్రవర్తననను విమర్శిస్తూ చాలామంది నెటిజనులు అయన కొడుకులు అయిన సూర్య .. కార్తి ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఇద్దరూ ఈ విషయంలో ఇంతవరకూ రెస్పాన్స్ ఇవ్వలేదు. అయినా ఫ్యాన్స్ ను కొందరు నటులు కాళ్ళతోనే తంతున్నారు మా డాడీ చాలా మేలు.. జస్ట్ ఫోన్ పగలగొట్టాడు అంతే అని సరిపెట్టుకున్నారో ఏమో!