బిబి బ్యూటీకి బిగ్‌ బాస్ మూవీలో ఛాన్స్‌!

Update: 2021-08-23 11:14 GMT
యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్‌ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్‌ సినిమా లో తమిళ స్టార్ నటుడు విజయ్‌ సేతుపతి.. మలయాళ స్టార్ ఫాహద్‌ ఫాజిల్‌ లు నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురు నటనలో లెజెంట్స్ అన్నట్లుగా పేరు దక్కించుకున్నారు. ఇక లోకేష్‌ కనగరాజ్‌ సినిమా అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ కాంబో పై కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు ఇతర ఇండియన్ భాషల ప్రేక్షకులందరిలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. విక్రమ్‌ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమాలో చిన్న పాత్ర చేసినా కూడా వారికి పాన్ ఇండియా స్థాయి గుర్తింపు రావడం కాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న శివాని నారాయన్‌ కు విక్రమ్‌ సినిమాలో నటించే అవకాశం దక్కిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బిగ్ బాస్‌ కు హోస్ట్‌ గా వ్యవహరించిన సమయంలోనే శివాని నారాయన్‌ అంటే కమల్‌ హాసన్ కు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిందట. అప్పుడే బిగ్ బాస్ కమల్‌ హాసన్ దృష్టిలో పడ్డ బిబి బ్యూటీ శివాని నారాయన్‌ కు ఇప్పుడు విక్రమ్‌ సినిమాలో ఆఫర్‌ దక్కిందని తమిళ మీడియా మరియు సినీ వర్గాల టాక్.

బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన శివాని నారాయన్ కు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కింది. సినిమాల్లో వరుసగా నటించే ఆఫర్లు వస్తున్న ఈ సమయంలో కమల్‌ హాసన్ మూవీ నుండి వచ్చిన ఆఫర్‌ ఆమె కెరీర్‌ ను పూర్తిగా టర్న్‌ చేసినట్లే అంటూ తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు. హేమా హేమీలు నటిస్తున్న ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా కూడా ఖచ్చితంగా కెరీర్‌ కుమంచి మైలేజ్ ఉంటుంది. అలాంటిది కీలక పాత్ర అవ్వడం వల్ల శివాని నారాయన్‌ కు మంచి పేరు రావడం ఖాయం అంటూ తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. 


Tags:    

Similar News