శివానీ రాజశేఖర్..ఎంట్రీ మాములుగా లేదు..

Update: 2018-07-24 05:22 GMT
టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూతురు  శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే అదరగొడుతోంది. ఇటు తెలుగులో తొలి సినిమాకు సైన్ చేసి ఆ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాకముందే తమిళంలో ఓ సినిమాకు ఒప్పుకొని అది పూర్తి చేస్తోంది. తెలుగులో ఎంట్రీ ఇవ్వకముందే తమిళంలో లాంచ్ అయ్యేలా కనిపిస్తోంది.

జీవితారాజశేఖర్ కూతురు శివానీకి ఇప్పుడు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. తెలుగులో ఈమె అడవి శేష్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘2స్టేట్స్’ రీమేక్ లో నటిస్తోంది. ఈ మూవీ ద్వారానే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. కానీ ‘2స్టేట్స్’ రిలీజ్ కు ముందే ఆమె ఓ తమిళ చిత్రం షూటింగ్ ను మొదలుపెట్టారు.

విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంతో శివానీ తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. విష్ణు విశాల్ సొంత ప్రొడక్షన్ సంస్థ వీవీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముధురైలో ఫుల్ స్పీడుతో సాగుతోంది. ‘2స్టేట్స్’ విడుదల కాముందే తమిళ చిత్రం ద్వారానే తెరకు పరిచయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎంట్రీతో రెండు భాషల్లో హీరోయిన్ గా శివానీ మెరుస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.
Tags:    

Similar News