మిస్ త‌మిళ‌నాడు సీక్రెట్ విప్పేసిన శివానీరాజ‌శేఖ‌ర్!

Update: 2022-05-06 10:45 GMT
యువ నాయిక శివానీ రాజ‌శేఖ‌ర్  'ఫెమినా మిస్ ఇండియా' రేసులో నిలిచిన సంగ‌తి తెలిసిందే.  ఇటీవ‌ల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మిస్ తమిళనాడుగా శివానీ  ఎంపికైంది. దీంతో శివానీ అస‌లైన పోరుకు సంసిద్ధ‌మైంది. దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న 31 మంది మిస్ ఇండియా కంటెస్టెంట్స్ లో శివానీ ఒకరుగా నిలిచారు. ఫెమినీ మిస్ ఇండియా ఎవ‌రు? అన్న‌ది త‌ర్వాత తెలుస్తుంది.  

అయితే తెలంగాణ రాష్ర్టం హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డిన శివానీ-త‌ల్లిదండ్రులు జీవితా రాజ‌శేఖ‌ర్ త‌మిళ‌నాడు నుంచి పోటీకి దించ‌డం ఏంటి?  అని సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్రాంతీయ బేధ‌మా? త‌మిళం అంటే మ‌క్కువ‌?  తెలుగు రాష్ర్టాలు అంటే చిన్నచూపా? ఇలా కొన్ని విమ‌ర్శ‌లు తెర‌పైకి వస్తున్నాయి.   ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ శివానీ టార్గెట్ చేసి  ట్రోలింగ్ కి సైతం మొద‌లు పెట్టారు. తాజాగా వాట‌న్నింటికి శివానీ పుల్ స్టాప్ పెట్టింది.

''తెలంగాణ‌లో  ఉంటున్నందుకు ముందుగా ఇక్క‌డ నుంచే పోటీ కి దిగాల‌నుకున్నా. కానీ నిర్వాహ‌కులు మ‌ల్టీ ఫుల్ ఛాయిస్ ఇవ్వ‌డంతో ద‌ర‌ఖాస్తులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ.. ఆంధ్రపదేశ్ తో పాటు నేను జన్మించిన తమిళనాడునూ అప్లికేషన్ లో రాశాను. కానీ నిర్వాహ‌కులు త‌మిళ‌నాడు రాష్ర్టం నుంచి ఎంపిక చేసారు.

అందువల్ల 'మిస్ తమిళనాడు'గా ఎంపికయ్యానని' శివానీ తెలిపింది. తెలుగు అమ్మాయిగా  రెండు రాష్ర్టాల నుంచి  ఎంపిక చేసి ఉంటే  మ‌రింత సంతోష ప‌డేదాన్ని అని..అయినా త‌మిళ‌నాడు కూడా నా సొంత రాష్ర్ట‌మేన‌ని తెలిపింది. రాష్ర్టాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే భార‌త‌దేశాన్ని రిప్ర‌జెంట్ చేయ‌డాన్ని గ‌ర్వంగాగా భావిస్తాన‌ని తెలివైన స‌మాధానం ఇచ్చింది.

జీవితారాజ‌శేర్ కుటుంబం కొన్నేళ్ల‌గా హైద‌రాబాద్ లోనే ఉంటుంది. స్థిర నివాసం ఇక్క‌డే ఏర్పాటు చేసుకున్నారు.  రాజ‌శేఖ‌ర్ త‌మీళియ‌న్ అయినా  తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చిన న‌టుడు. ఆయ‌న ఇక్క‌డ పెద్ద హీరో. ఇక పోటీల్లో ఇలాంటి సందిగ్ధం ఏర్ప‌డిన‌ప్పుడు ఒక రాష్ర్టాన్నే ఆప్స‌న్ గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని కొంద‌రు అంటున్నారు.

దానికి సంబంధించిన నిబంధ‌న‌లు వివ‌రంగా ద‌ర‌ఖాస్తు ఫాంలో ఉంటాయి. ఏ రాష్ర్టం నుంచి ఎంపిక చేయాల‌న్న‌ది పూర్తిగా కంటెస్టెంట్ ఇష్టంపైనే  ఆధార‌ప‌డి ఉంటుంది. దాని ప్ర‌కార‌మే జ్యూరీ ఫైన‌ల్ చేస్తుంది.  ఒక రాష్ర్టాన్ని మాత్ర‌మే ఆప్ష‌న్ గా  ఇస్తుంది. ఒక‌వేళ రెండు..మూడు రాష్ర్టాలు ఆప్ష‌న్స్ ఇస్తే వాటికి సంబంధించిన ప్రయ‌ర్టీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ క్ర‌మంలో తెలుగు రాష్ర్టాల‌కి మొద‌టి ప్రాధాన్య‌త  పోటీ దారుడే ఇవ్వొచ్చు. అది పోటీ దారుని ఇష్టంపైనే  ఉంటుంది. ఆ క్ర‌మంలో శివానీ త‌మిళ‌నాడు రాష్ర్టాన్ని ఆప్ష‌న్ గా ఎంపిక చేసుకుని ఉండొచ్చ‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News