శివాని రాజశేఖర్... రాజశేఖర్, జీవితల గారాల కూతురు. తెలుగులో హీరోయిన్ కావాలనే పట్టుదలతో ఈ మధ్యనే అడవి శేషుతో ఓ సినిమాను ప్రారంభించిందీ చిన్నది. ఇంకా ఆ సినిమా షూటింగ్లో సరిగ్గా పాల్గొనను కూడా లేదు అప్పుడే ఓ పెద్ద కంపెనీకి బ్రాండ్ ఎండార్సీగా ఎంపికయ్యిందని సమాచారం. మామూలు చిన్నా చితకా కంపెనీ అయితే అదేం పెద్ద విషయం కాదు కానీ, శివానీ ఏకంగా శీతల పానీయాల ఉత్పత్తిలో దిగ్గజ సంస్థ అయిన కోకా కోలా కంపెనీకి ఎండార్స్ చేస్తుండడమే విశేషం.
కోకా కోలా కంపెనీకి బాలీవుడ్ స్టార్లు సల్మాన్ - అమీర్ - రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొనే - అలియా భట్ వంటి పాపులర్ నటులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్సప్ యాడ్ కోసం చేసే స్టంట్ల గురించి చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు థమ్సప్ యాడ్స్ ద్వారా కోట్ల రూపాయల్లోనే ఆదాయం పొందుతున్నాడు. అలాంటి కంపెనీ ఇంకా ఒక్క సినిమా కూడా పూర్తి చేయని శివాని రాజశేఖర్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇది శివానికి చాలా కలిసొచ్చే అంశమే.
ఈ మధ్యనే శివాని మీద ఓ టెస్ట్ షూట్ చేశారని - త్వరలో బ్రాండ్ ఎండార్సీ గురించి ఫైనల్ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అలియా బాలీవుడ్ లో చేసిన టూస్టేట్స్ మూవీ రిమేక్ తో ఎంట్రీ ఇస్తున్న శివానీ - అక్కడ అలియా చేసిన యాడ్ లోనే ఇక్కడ కనిపిస్తుందేమో చూడాలి. ఏమో అనుకున్నాం గానీ రాజశేఖర్ - జీవితలు శివానీని స్టార్ ను చేసేందుకు పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.