పాన్ ఇండియా ట్రెండ్ అన్ని భాషల స్టార్లను ఊపేస్తోంది. ఒకరితో ఒకరికి పోటీ వాతావరణాన్ని పెంచింది. ఇక పాన్ ఇండియా రేస్ లో తెలుగు సినీపరిశ్రమ పొరుగు పరిశ్రమల కంటే జోరు మీద ఉంది. మనకు అరడజను మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు ఇప్పుడు. అయితే ఈ జాబితాలోకి దూసుకొచ్చేందుకు ఇతర తెలుగు సీనియర్ హీరోలు పోటీపడుతున్నారు. కింగ్ నాగార్జున తెలుగు-తమిళ పరిశ్రమలకు అగ్ర హీరోగా సుపరిచితం.
హిందీ పరిశ్రమకు దశాబ్ధాల క్రితమే సుపరిచితుడు. గీతాంజలి డేస్ నుంచి కింగ్ నాగార్జునకు ఉత్తరాదిన భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే అతడు నటించే సినిమాలకు పాన్ ఇండియా రీచ్ తేవడం లేటెస్ట్ ట్రెండ్ లో కష్టమేమీ కాదు. అదే క్రమంలో ప్రవీణ్ సత్తారు లాంటి ట్యాలెంటెడ్ దర్శకుడితో `ఘోస్ట్` లాంటి విభిన్నమైన సినిమాని ప్లాన్ చేసారు నాగార్జున. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. ఫస్ట్ లుక్ దూసుకెళ్లింది. టీజర్ యూనివర్శల్ అప్పీల్ తో ఆకట్టుకుంది. కింగ్ ఈసారి యూనిక్ స్టైల్లో కొత్తగా ట్రై చేస్తున్నారని కూడా టాక్ వినిపించింది. అటు బాలీవుడ్ మీడియాలోనూ టీజర్ కి భారీ ప్రచారం దక్కింది.
అయితే ఇంతలోనే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా `ఘోస్ట్` టైటిల్ తో బరిలో దిగుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. కింగ్ అఫ్ అల్ మాసెస్ శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా `ఘోస్ట్` ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. పోస్టర్ ఎంతో ప్రామిస్సింగ్ గా కనిపిస్తోంది. శివన్న ఈసారి అదిరే కాన్సెప్ట్ తో వస్తున్నాడని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో ప్లాన్ చేయడం కూడా తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అటు కన్నడలో రాకింగ్ స్టార్ యష్ మాత్రమే పాన్ ఇండియా స్టార్. ఆ తర్వాత సుదీప్ .. ఉపేంద్ర లాంటి స్టార్లు పాన్ ఇండియా రేస్ లో పరుగులు పెట్టాలని చూస్తున్నారు. ఇంతలోనే కన్నడ రంగంలోనే మోస్ట్ ప్రామిస్సింగ్ స్టార్ గా పేరున్న శివరాజ్ కుమార్ బరిలో దిగాడు.
ఆసక్తికరంగా ఘోస్ట్ చిత్రంలో అన్ని భాషల నటులకు అవకాశం కల్పించారు. పాన్ ఇండియా ఫిలిం గా కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీ లో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని ప్రకటించారు. బ్లాక్ బస్టర్ `బీర్బల్` దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రముఖ రాజకీయనాయకులు.. నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇది ఆసక్తికరమైన యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ మూవీ. ఇక ఈ మూవీకి క్లైమాక్స్ మైండ్ బ్లాక్ చేస్తుందంటూ ప్రచారం సాగిపోతోంది. ఈ కథ లో మెయిన్ థీమ్ భాషలకి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందుకే 5 భాషల్లో తీస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా కిచ్చా సుదీప ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసి శివరాజ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ డిజైన్ ఆద్యంతం ఆసక్తిని పెంచింది.
పోస్టర్ లో గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ చూడగానే కన్నడ నాట కేజీఎఫ్ తరహాలోనే ఇది కూడా భారీ యాక్షన్ చిత్రం అని సూచిస్తోంది. అలాగే రివాల్వర్ కార్ కలిపి చేసిన డిజైన్ ఇది హైస్ట్ ఫిలిం అని హింట్ ఇస్తోంది. సెర్చ్ లైట్ - బైకర్స్- కార్స్- గన్స్... వీటితో డిజైన్ చేసిన పోస్టర్ డిటైలింగ్ చాలా బాగుంది. ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ చిత్రం మీద అంచనాలు పెంచిందని చెప్పాలి. అర్జున్ జన్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ ప్రజలు శివరాజ్ కుమార్ ని కరునడ చక్రవర్తి అని అభిమానంగా పిలుచుకుంటారు. అందుకే అతడిని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టేందుకు ఇప్పుడు అసాధారణ ప్రయత్నం జరుగుతోందని కూడా తెలుస్తోంది.
ఒకేసారి రెండు పొరుగు భాషల్లో ఘోస్ట్ టైటిల్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. నాగార్జున.. శివరాజ్ కుమార్ సేమ్ టైటిల్ ని ఎంపిక చేసుకోవడం ఉత్కంఠ పెంచుతోంది. అయితే దేనికదే విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్నవే. అలాగే పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసి తెరకెక్కిస్తున్న సినిమాలుగానూ పాపులరవుతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంటుంది.