క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం `రంగమార్తాండ` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠా బ్లాక్ బస్టర్ కి రీమేక్ ఇది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్- రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనసూయ అలియాస్ రంగమ్మత్త .. సీనియర్ నటుడు బ్రహ్మానందం ఇతర మఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. నటీనటులు.. సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో దర్శకుడు బిజీ అయ్యారు. అటు షూటింగ్ కు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ కొట్టి దర్శకుడిగా కంబ్యాక్ అవ్వాలనే పట్టుదల తో కృష్ణవంశీ కసిగా పని చేస్తున్నారట.
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రతిదీ పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యం లో మరో ముఖ్యమైన పాత్రకు యాంగ్రీమెన్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను ఎంపిక చేసినట్లు తెలిసింది. శివాత్మిక వయసులో ఉన్న కొందరిని ఆడిషన్ చేసాక.. చివరిగా శివాత్మిక అయితేనే బాగుంటదని తుదిగా తనను ఎంపిక చేసినట్లు సమాచారం. జీవిత రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మిక దొరసాని చిత్రంతో కథానాయిక గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమా తోనే విమర్శకుల ప్రశంలందుకుంది. శివాత్మిక నేచురల్ పెర్ఫామెన్స్ .. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని కామన్ ఆడియన్స్ సైతం ప్రశసించారు.
అందుకే రెండో సినిమాకే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకోగల్గింది. నటీనటుల నుంచి అన్నిరకాల స్కిల్స్ ని బయటికి తీయడంలో కృష్ణవంశీ పనితనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సీనియర్ దర్శకుడి చేతిలో పడితే నటిగా మరింత మెరుగుపడే ఛాన్సుంటుంది. కాబట్టి శివాత్మిక బెస్ట్ పెర్పామెన్స్ ఇవ్వడానికి ఈ సినిమా మంచి వేదిక అవుతుంది. కృష్ణవంశీ ఎంతో మంది భామల్ని హీరోయిన్లుగా పరిచయం చేసారు. వారంతా స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు. తాజా చిత్రంలో శివాత్మిక రోల్ ఎలాంటిది? పరిధి ఎంత అన్నది? తెలియాల్సి ఉంది.