బాహుబలిని ఒకటిగా చూస్తే వేస్టే...

Update: 2015-03-20 05:35 GMT
ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీబడ్జెట్‌ చిత్రం బాహుబలి. రానా, అనుష్క, తమన్నా ప్రధానతారాగణం. శోభుయార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌, ప్రణాళికల గురించి నిర్మాత శోభు ముచ్చటించారు.

బాహుబలి కథ విన్నప్పుడు ఇది భారీ స్పాన్‌ ఉన్న కథ. కేవలం ఒక భాగంతో సరిపెట్టుకుంటే బావుండదు. రెండు భాగాలుగా చేస్తేనే దీనికి పూర్తి స్థాయి న్యాయం చేసినట్టవుతుందని భావించాం. రాజమౌళికి ఆ విషయాన్ని చెప్పాం. ఆ తర్వాత ఒకటి అనుకున్నది రెండు భాగాలు అయ్యింది. అలాగే పని విషయంలో రాజీకి రాని మనస్తత్వం రాజమౌళిది. అతడి గురించి చాలా ఏళ్లుగా తెలుసు. అతడి పనితనాన్ని దగ్గరగా చూశాను. అందుకే ప్రతి విషయంలో వేలు పెట్టకుండా అన్నీ అతడికే అప్పగించాం. రాజమౌళి ఓసారి కెమెరా వెనక్కి వెళ్లాడంటే ఇక అతడికి బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు. అంతటి డెడికేషన్‌ ఉన్న దర్శకుడు. అలాగే యూనిట్‌ సభ్యుల్ని మేం కుటుంబ సభ్యుల్లా భావిస్తాం.

ఫుటేజ్‌ లీకేజ్‌ గురించి చెబుతూ... అయితే ఫుటేజ్‌ లీకేజీ అనేది పెద్ద సమస్య. అందుకే కొన్ని కండిషన్లు పెట్టుకున్నాం. ఆన్‌సెట్స్‌కి ఎవరూ ఫోన్లు తేకూడదు. అలాగే ప్రతి యూనిట్‌ మెంబర్‌ డిస్‌క్లెయిమెర్‌ కిందే లెక్క. ఆ సంగతిని ముందే సంతకాలు చేయించుకుంటాం.. అని శోభు చెప్పారు. అంతేకాదు ఒకవేళ పార్ట్‌ 1 ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతే? అన్న ప్రశ్నకు అలాంటి భయాలేవీ నాలో లేవని మొండిగా సమాధానమిచ్చారు.

Tags:    

Similar News