స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తి చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మెజారిటీ స్టార్ హీరోలు.. ఏడాదికి ఒక సినిమానే చేస్తారు. ఈ ట్రెండుకు బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ అనే తేడాలు ఉండవు. అయితే అక్షయ్ కుమార్ లాంటివారు మాత్రం ఇలాంటివాటికి ఎక్సెప్షన్.. ఆయన ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తాడు. అయితే మన స్టార్ హీరోల్లో అంత స్పీడ్ దాదాపు ఎవరికీ లేదు.
రీసెంట్ గా కార్తి సరిగ్గా ఇదే విషయంలో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కార్తి కొత్త సినిమా 'ఖైది' ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కార్తి జస్ట్ 36 రోజులే వర్క్ చేశాడట. ఇంత తక్కువ సమయంలో ఒక సినిమాను పూర్తి చేయడం కార్తికి ఇది మొదటిసారి. చిత్రమైన విషయం ఏంటంటే ఇదే కార్తి 'పడుత్తివీరన్' సినిమాకోసం రెండేళ్ళు.. 'ఆయిరత్తిల్ ఒరువన్'(యుగానికి ఒక్కడు) సినిమాకు మూడేళ్ళు పని చేశాడు. ఇలా హయ్యెస్ట్ వర్కింగ్ డేస్.. లోయస్ట్ వర్కింగ్ డేస్ రెండూ రికార్డు స్థాయిలో ఉన్నహీరో కార్తి మాత్రమే అయి ఉంటాడు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ ఒక్కరాత్రిలో జరుగుతుందనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా విడులైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. కార్తికి తెలుగులో మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఈ దీపావళి పండగకు హిట్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పోటీలో మరో తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా 'విజిల్' తప్ప మరో తెలుగు సినిమా లేకపోవడం కార్తికి కలిసి వచ్చే అంశమే. వరస ఫెయిల్యూర్లతో సతమతమవుతున్న కార్తికి ఈ సినిమా అయినా హిట్టిస్తుందా అనేది వేచి చూడాలి.