దిల్ రాజు.. టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా ప్రముఖంగా వినిపిస్తోంది. టాలీవుడ్ షూటింగ్ ల బంద్ నుంచి 'వారసుడు' థియేటర్ల వివాదం వరకు ప్రతీ విషయంలోనూ దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సినిమాల నిర్మాణంతో పాటు నైజాం, వైజాగ్ ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ దిల్ రాజు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు నైజాంతో పాటు ఉత్తరాంధ్రలోనూ పెద్ద పోటీ ఎదురవుతోంది. రీసెంట్ గా నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మైత్రీ మూవీ మేకర్స్ వారం రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.
ఇద్దరు అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణలతో నిర్మించిన 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి' సినిమాలని నైజాంలో మైత్రీ వారే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గతంలో వీరి సినిమాలని దిల్ రాజుకే ఇచ్చేవారు. కానీ టైమ్ మారింది.. గేమ్ మారింది. మైత్రీ వారు కూడా నైజాం, ఉత్తరాంధ్రల్లో డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టారు. దీంతో ఈ రెండు సినిమాలని వారే స్వయంగా రిలీజ్ చేసుకోవడం దిల్ రాజుకు ఊహించని షాక్ గా చెప్పుకుంటున్నారు.
ఇదిలా వుంటే తాజాగా దిల్ రాజుకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్న ఈ మూవీ బుధవారం అంటే జనవరి 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. పూజా హెగ్డే , శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
ఇదిలా వుంటే ఈ మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ, నైజాం డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ పిలింస్ వారు భారీ మొత్తానికి దక్కించుకున్నారని తెలిసింది. గత కొంత కాలంగా మహేష్ సినిమాలని నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా SSMB28 ని మాత్రం ఏషియన్ ఫిలింస్ కే హారిక అండ్ హాసిని వారు ఇచ్చేయడంతో దిల్ రాజుకు ఇది పెద్ద షాకే అంటున్నాయి నైజాం ట్రేడ్ వర్గాలు. తాజా పరిణామానికి కారణం మహేష్ తో ఏషియన్ వారికున్న బాండింగ్ అని తెలుస్తోంది. ఆ కారణంగానే SSMB28 ని దిల్ రాజుకు కాకుండా ఏషియన్ వారికి ఇచ్చేశారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.