వ‌కీల్ సాబ్’కు షాక్.. నిర్మాత‌ల‌కు కోర్టు నోటీసులు!

Update: 2021-05-03 09:41 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'వకీల్ సాబ్'. మూడేళ్ల గ్యాప్ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్.. అద్దిరిపోయే హిట్ అందుకున్నారు. నెవ్వ‌ర్ బిఫోర్ రికార్డ్స్ సెట్ చేసిన ఈ మూవీతో.. ఫ్యాన్ పండ‌గ చేసుకున్నార‌నే చెప్పాలి. అయితే.. ఈ చిత్రానికి తాజాగా లీగ‌ల్ చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి.

ఈ చిత్ర నిర్మాత‌లు త‌న‌ను ఇబ్బంది పెట్టారంటూ ఓ వ్య‌క్తి పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్టు స‌మాచారం. వ‌కీల్ సాబ్ సినిమాలో త‌న అనుమ‌తి లేకుండా త‌న ఫోన్ నెంబ‌ర్ వాడుకున్నార‌ని సుధాక‌ర్ అనే వ్య‌క్తి పంజాగుట్ట పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది.

త‌న అనుమ‌తి లేకుండా వ‌కీల్ సాబ్ సినిమాలో ఓ చోట స్క్రీన్ పై త‌న నంబ‌ర్ చూపించార‌ని కంప్లైంట్లో పేర్కొన్నాడట‌. దీంతో.. ఎంతో మంది త‌న నంబ‌ర్ కు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నార‌ని వాపోయాడట‌. కొంద‌రు బూతులు కూడా తిడుతున్నార‌ని పేర్కొన్న‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యంలో బాధితుడి త‌ర‌పు లాయ‌ర్.. సినిమా నిర్మాత‌ల‌కు లీగ‌ల్ నోటీసులు కూడా పంపిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి, దీనిపై వారు ఎలా స్పందిస్తార‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News