నిద్ర కోసం ఆ నటి ఏడ్చేదట.. పుకార్లు దారుణంగా వేధించాయట

Update: 2022-01-06 05:32 GMT
టాలీవుడ్ నటీమణులు బాలీవుడ్ కు తక్కువే కానీ.. బాలీవుడ్ నటీమణులను టాలీవుడ్ కు దిగుమతి చేసుకోవటం.. వారికి కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్ని ఇవ్వటం తెలిసిందే. తెలుగువారికి తెలుగు అమ్మాయిల కంటే కూడా.. పరాయి రాష్ట్రాల అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న విమర్శ తెలిసిందే. అలా ముంబయి నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టి.. పలు సినిమాలు చేసిన నటీమణుల్లో సీనియర్ నటి రవీనా టాండన్ ఒకరు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె నోటి నుంచి వచ్చిన షాకింగ్ అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

అప్పట్లో మీడియా అన్ని అవాస్తవాలే రాసేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో తన సోదరుడితో తాను రిలేషన్ లో ఉన్నట్లుగా ప్రచారం జరిగిందని చెప్పారు. ‘అసలు ఎలా రాస్తారు? మీడియా ప్రతినిధులు దీనికేం సమాధానం ఇస్తారు. కో స్టార్స్ తో స్నేహంగా ఉంటే.. రిలేషన్ లో ఉన్నట్లుగా అవాస్తవాల్ని ప్రచారంలోకి తెచ్చేవారన్నారు.

ఒక దశలో తన సోదరుడితో తనకు సంబంధం ఉందని రాశారని.. ఆ సందర్భంలో తానుచాలా క్రుంగిపోయినట్లు చెప్పారు. అప్పట్లోజర్నలిస్టుల దయతో నటీనటులు ఉండేవారని చెప్పి అందరికి షాకిచ్చారు. నెల తిరిగేసరికి.. చిత్ర పరిశ్రమకు చెందిన వార్తలతో మేగిజైన్ వస్తుందంటే.. తాను చాలా భయపడేదానిని చెప్పారు. ఎప్పుడు ఏ పుకారు వస్తుందో అని భయంగా బతకాల్సి వచ్చేదన్నారు.

తాను అనేక నిద్ర లేని రాత్రుల్ని గడిపినట్లుగా గుర్తు చేసుకున్నారు. నిద్ర పోవటం కోసం తాను ఏడ్చేదానినని.. ఎప్పుడు ఎవరితో లింకు ఉందన్న పుకారు వస్తుందన్న టెన్షన్ ఉండేదన్నారు. తన విశ్వసనీయత.. ప్రతిష్ఠ.. తన తల్లిదండ్రుల మనసుల్ని ముక్కలు చేశాయన్నారు. సొంత సోదరుడితో సంబంధం ఉన్నట్లు రాశారని.. రవీనా కొత్తబాయ్ ఫ్రెండ్ ను కనిపెట్టామని స్టార్ డస్ట్ రాసిందని.. దాన్ని ఎలా రాస్తారు? అని ప్రశ్నించారు.

అప్పట్లో సినిమా జర్నలిస్టులు.. ఎడిటర్ల దయతో జీవిస్తున్నట్లుగా ఉండేదన్నారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోవటం.. సోషల్ మీడియా పుణ్యమా అని.. మొత్తంఈక్వేషన్లు మారిపోయాయి. ఏమైనా.. గతాన్ని గుర్తు చేసుకొని.. అప్పట్లో తాను పడిన వేదనను మొత్తంగా చెప్పేయటం ద్వారా.. తనను విడవకుండా వెంటాడుతున్న దరిద్రపు గతాన్ని రవీనా వదిలించుకుందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News