గాయ‌ని సునీత తొలి ఛాన్స్‌.. షాకింగ్ నిజాలు!

Update: 2019-08-11 07:31 GMT
`ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు`.. `గులాబి` సినిమాలోని ఈ పాటను యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. జేడీ చక్రవర్తి- మహేశ్వరి జంటగా నటించిన ఈ సినిమా కృష్ణవంశీకి దర్శకుడిగా తొలి ఎటెంప్ట్‌. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటను సునీత పాడారు. ఈ పాటే సునీత‌ను తెలుగు సినీలోకానికి ప‌రిచ‌యం చేసింది. అప్పటికి త‌న వ‌య‌సు 15. తొలి పాట‌తోనే బ్లాక్ బ‌స్ట‌ర్ గాయ‌ని అయ్యారు. అటుపై కెరీర్ ప‌రంగా వెనుతిరిగి చూసిందే లేదు. ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపిన గాయ‌నిగా వెలిగిపోయారు. త‌న‌కు యువ‌త‌రంలో ఉన్న పాపులారిటీ వేరొక గాయ‌నికి ఆ రోజుల్లో లేదంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే ప‌రిశ్ర‌మ‌లో టాప్ గాయ‌నిగా ద‌శాబ్ధాల పాటు రాణించారు. బుల్లితెర‌- వెండితెర రెండుచోట్లా సునీత ఫేమ‌స్. అయితే త‌న‌కు తొలి ఛాన్స్ ఎలా వ‌చ్చింది? అని ప్ర‌శ్నిస్తే ఎన్నో ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిపారు. నిన్న‌టి సాయ‌త్రం విశాఖ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్రమంలో పాల్గొన్న సునీత త‌న లైఫ్ జ‌ర్నీ గురించి ముచ్చ‌టించారు.

చిన్న వ‌య‌సులోనే క‌ర్నాట‌క సంగీతం.. లలిత సంగీతంలో శిక్షణ పొందాను. ఐదేళ్ల వయసుకే త్యాగరాయ సంగీత ఆరాధనోత్సవాలకు హాజరయ్యాను. 8వ ఏట దిల్లీలోని జానపద పోటీల్లో పాల్గొని స్కాలర్‌ షిప్‌ సాధించాను. ఆ త‌ర్వాత అనుకోకుండా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యాను. అస‌లు తొలి ఛాన్స్ కోసం నేను ప్ర‌య‌త్నించిందే లేదు. దూరదర్శన్‌లో ప్రసారమైన నా పాట  విని గులాబీ (1995) సినిమాలో పాడే అవ‌కాశం ఇచ్చారు సంగీత ద‌ర్శ‌కుడు శ‌శిప్రీత‌మ్. అప్ప‌టికి సినీప‌రిశ్ర‌మలో ఎవ‌రూ ప‌రిచ‌యం లేరు. కేవ‌లం పాట విని శ‌శిప్రీత‌మ్ న‌న్ను పిలిచారు అని తెలిపారు.

నిజ‌మే అస‌లు ఇప్పుడున్నంత మీడియా ప‌బ్లిసిటీ కానీ.. బుల్లితెర రియాలిటీ షోలు కానీ అప్ప‌ట్లో లేనేలేవు. ఏవో అరుదుగా ఈటీవీలో గాయ‌నీగాయ‌కుల కోసం కొన్ని కార్య‌క్ర‌మాలు న‌డిచేవి. అయితే వాటిలో వేటిలోనూ సునీత పాపుల‌ర్ కాదు. నేరుగా సినీ గాయ‌కురాలిగా గులాబీ చిత్రంలో అవ‌కాశంతో పాపుల‌ర‌య్యారు. అయితే ఇప్పుడున్న‌ట్టు అప్ప‌ట్లో ట్యాలెంట్ చూపించే వేదిక‌లే ఉండేవి కావు. ఇప్పుడు బుల్లితెరపై గాయ‌నీగాయ‌కుల‌కు బోలెడ‌న్ని అవ‌కాశాలొస్తున్నాయి. విదేశీ కాన్సెర్టుల పేరుతో దేశ‌విదేశాల్ని చుట్టి వ‌చ్చే అవ‌కాశం వ‌స్తోంది. భారీగా పారితోషికం గిట్టుబాటు అవుతోంది. ఇప్పుడున్న డ‌జ‌ను మంది గాయ‌నీగాయ‌కులు అస‌లు క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. న‌వ‌త‌రం ప్ర‌తిదీ ఒడిసి ప‌ట్టుకుంటోంది. అయితే అంద‌రూ సునీత అంత గొప్ప గాయ‌ని అవ్వ‌డం కుద‌ర‌దు. ఎంద‌రు గాయ‌నీమ‌ణులు ఉన్నా సునీత వేరు. త‌న క్రేజు వేరు. తన క‌మిట్ మెంట్ వేరు. ప్ర‌తిభ వేరు. అందుకే త‌న‌కు అంత ఫాలోయింగ్.


Tags:    

Similar News