కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 14న ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే పలు రికార్డుల్ని తిరగరాసి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
దాదాపు నాలుగేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్ `కేజీఎఫ్ చాప్టర్ 1` అండర్ డాగ్ గా విడుదలై తన సత్తాని చాటింది. దీంతో చాప్టర్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో చాప్టర్ 2 వుండటంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు దేశ వ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు. విడుదలైన ప్రతీ భాషలోనూ ఈ చిత్రం సంచలనాలు సృష్టించింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ లుగా నిలబెట్టింది. హిందీ బెల్ట్ లో సరికొత్త రికార్డుని సొంతం చేసుకున్న కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి తన సత్తాని చాటుకుంది. అయితే ఈ సినిమా ఈ స్థాయిలో సంచలనాలు సృష్టించడం వెనక ప్రశాంత్ నీల్ నమ్మకం, శ్రమ, ఎంతో మంది అతన్ని తిరస్కరించారన్న కసి వుంది. దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో యాక్షన్ కథతో చాలా మందిని కలిశారట. అయితే రోటీన్ కథ కావడంతో వెళ్లిన ప్రతీ చోట అతనికి అవమానమే ఎదురైందట.
దీంతో కసిగా సక్సెస్ ని సొంతం చేసుకోవాలన్న ప్రశాంత్ నీల్ తన బావ శ్రీమురళినే హీరోగా పెట్టి తొలి ప్రయత్నంగా `ఉగ్రం`ని తెరకెక్కకించాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అప్పడే `కేజీఎఫ్` కథ మొదలైంది. ప్రశాంత్ నీల్ వన్ ఫిల్మ్ వండర్. కానీ అతని విజన్ ని నమ్మి హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. హీరోగా ఓ మోస్తారు పేరున్న యష్ ని హీరోగా తీసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి `కేజీఎఫ్`తో అద్భుతం చేశారు. అప్పటి వరకు కన్నడ సినీ చరిత్రలోనే 100 కోట్లు సాధించిన సినిమా లేదు. కేజీఎఫ్ ఆ ఫీట్ ని సాధించడంతో ఒక్కసారిగా కన్నడ నాట ప్రశాంత్ నీల్ క్రేజీ డైరెక్టర్ అయ్యారు.
ఇప్పడు విడుదలై `కేజీఎఫ్ 2` అంతకు మించిన విజయాన్ని సాధించడంతో దేశ వ్యాప్తంగా క్రేజీ డైరెక్టర్ లా జిబితాలో చేరిపోయాడు. రాజమౌళి తరువాత ఇప్పడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్`ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ప్రొటెన్షియాలిటీని మరింతగా బయటికి తీసే సినిమాగా ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. `కేజీఎఫ్ 2` సంచలనాలు సృష్టిస్తుండటంతో ప్రశాంత్ నీల్ కోసం మన ప్రొడ్యూసర్స్ వెంటపడుతున్నారు. ఇప్పటికే క్రేజీ నిర్మాణ సంస్థలు అతని కోసం క్యూకట్టాయి. కొన్ని అడ్వాన్సులు కూడా ఇచ్చేశాయి.
ఇందులో ముందు వరుసలో నిలిచిన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం మహేష్ బాబు తో `సర్కారు వారి పాట` చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సంస్థ త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ మూవీని నిర్మించబోతోంది. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నారు. `సలార్` తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దాదాపు 50 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్ 50 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ తరువాత `ట్రిపుల్ ఆర్` ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యకు కూడా ప్రశాంత్ నీల్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయినట్టుగా చెబుతున్నారు. దీనికి కూడా 50 కోట్లు డిమాండ్ చేసినట్టుగా తెలిసింది.
`
కేజీఎఫ్ కు 25 కోట్లు పారితోషికం తీసుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ కావడంతో తన రెమ్యునరేషన్ ని డబుల్ చేయడం పలువురికి షాక్ కొడుతోందట. ప్రభాస్ `సలార్` చిత్రానికి కూడా 25 కోట్లు మాత్రమే తీసుకున్న ప్రశాంత్ నీల్ ఏకంగా మైత్రీ, దానయ్య చిత్రాలకు 50 కోట్లు డిమాండ్ చేయడం నిజంగా షాకే. స్టార్ హీరోలు కనీసం సినిమా ఇవ్వడానికే ఆలోచించిన రోజుల నుంచి తనతో మాత్రమే సినిమా చేస్తా అనే స్థాయికి ప్రశాంత్ నీల్ ఎదగడం నిజంగా అబినందనీయం. కసి, పట్టుదల వుంటే ఏదైనా సాధ్యమే అని ప్రశాంత్ నీల్ ప్రాక్టికల్ గా నిరూపించి ఓ ఫిక్షనల్ స్టోరీని యావత్ దేశం మొత్తం చర్చించుకునేలా చేసి శభాష్ అనిపించుకోవడం గ్రేట్.