షూ బైట్.. ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమవుతున్న సినిమా పేరు. ఈ చిత్రం ఎప్పుడో దశాబ్దం కిందట మొదలైంది. చాలా ఏళ్ల కిందటే ఇది రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని వివాదాల్లో చిక్కుకుని మరుగున పడిపోయింది. కొన్ని రోజుల కిందటే ట్విట్టర్లో అమితాబ్ బచ్చన్.. దీని ప్రస్తావన తెచ్చాడు. తాము ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామని.. దయచేసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఈ చిత్ర నిర్మాణ సంస్థ.. దీనికి అడ్డు పడుతున్న సంస్థల్ని వేడుకున్నాడు అమితాబ్. ‘విక్కీ డోనర్’తో గొప్ప పేరు సంపాదించిన సూర్జిత్ సిర్కార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘విక్కీ డోనర్’ కంటే ముందు అతను ఈ చిత్రాన్ని తీశాడు.
అమితాబ్ ఈ సినిమా విడుదల గురించి గళం విప్పాక సూర్జిత్ కూడా మీడియాతో మాట్లాడాడు. ఈ సినిమాను బయటికి తేవడానికి తాను ఏం చేయడానికైనా సిద్ధమని.. ఎంతైనా ఖర్చు పెట్టుకుంటానని అన్నాడు. తన ఇల్లు అమ్మి అయినా సరే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. దయచేసి సినిమాను బయటికి తేవడానికి సహకరించాలని యూటీవీ వాళ్లను కోరాడు. భారత సంతతికి చెందిన హాలీవుడ్ దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్ రాసిన స్క్రిప్టు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా.. దాని హక్కుల విషయమై వివాదం నెలకొంది. అందుకే సినిమా పూర్తయ్యాక విడుదల కాకుండా ఆగిపోయింది. మరి అమితాబ్.. సూర్జిత్ ఇంతగా ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ చిత్రానికి మోక్షం కలుగుతుందేమో చూడాలి.