సెకండ్ వేవ్ ప్రభావం ఉత్తరాదిని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం మహారాష్ట్ర- ముంబైలోనే 50 శాతం కేసులు నమోదవుతుండడంతో ఉత్తరాది అంతటా హై అలెర్ట్ ప్రకటించింది మహా ప్రభుత్వం. వీకెండ్స్ అక్కడ థియేటర్లు మల్టీప్లెక్సుల్లో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఈ ప్రభావం అటు బాలీవుడ్ సహా టాలీవుడ్ రిలీజ్ లపైనా పడుతోంది.
ఇటీవల రానా నటించిన అరణ్య తెలుగులో విడుదల కాగా.. కదన్ పేరుతో తమిళంలోనూ రిలీజైంది. కానీ హిందీ వెర్షన్ హాథీ మేరా సాథీ రిలీజ్ ఆగిపోయింది. సెకండ్ వేవ్ ప్రభావమే దీనికి కారణం. ఇక అరణ్య కదన్ చిత్రాలు ఫ్లాపవ్వడంతో హిందీ వెర్షన్ పైనా ఆ ప్రభావం పడుతుందని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడు తలైవి హిందీ వెర్షన్ ని కూడా ఉత్తరాదిన రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొందిట. సెకండ్ వేవ్ ప్రభావంతో అనేక ఉత్తర భారత రాష్ట్రాల్లోని థియేటర్లు మరోసారి మూసివేశారు. దీనివల్ల కేవలం తమిళం - తెలుగు భాషలలో మాత్రమే తలైవి విడుదల చేస్తారని.. ఏప్రిల్ 23 రిలీజ్ తేదీ లాక్ చేశారని ప్రచారమవుతోంది. అయితే సైమల్టేనియస్ గా ఉత్తరాదిన రిలీజ్ కి ఆస్కారం కలుగుతుందా? లేక మరొక తేదీన విడుదలవుతుందా అనేది సందిగ్ధత నెలకొంది. అయితే ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని భావిస్తే.. నిర్మాతలు నిజం ఏమిటన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.