బెంగాళీ భామ శ్రద్ధా దాస్ పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటోంది. ఆర్య 2- గుంటూరోడు- మొగుడు ఇలా చాలా సినిమాలే చేసినా శ్రద్ధా దాస్ కి ఎందుకనో ఆశించినంత రేంజ్ రాలేదు. వరుణ్ సందేశ్ సరసన పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం కోటిగొబ్బ 3 (కన్నడ).. నిరీక్షణ (తెలుగు).. అర్థం అనే సినిమాల్లో నటిస్తోంది. వీటికి సంబంధించిన తాజా అప్ డేట్ తెలియాల్సి ఉంది.
అవకాశాల కోసం శ్రద్ధా ఫ్లెక్సిబిలిటీస్ తనకు శ్రీరామరక్ష అనే చెప్పాలి. కథానాయికగా ఆఫర్లు కరువైన సమయంలోనే శ్రద్ధా `ఆర్య 2`లో వ్యాంప్ తరహా పాత్రలో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేసింది. ఇతర నాయికలతో కలిసి కనిపించేవి చిన్న పాత్రలైనా అంగీకరించింది. ఐటెం నంబర్లలోనూ కనిపించింది. అందుకే ఇప్పటికీ ఈ బ్యూటీని అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి.
కానీ కొన్నేళ్లుగా పరిశ్రమలోనే ఉన్నా ఆశించినంత స్టార్ డమ్ అందకపోవడం తనలో నిరాశను పెంచింది. ఇటీవల కొంతకాలంగా సోషల్ మీడియాల్లో హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతున్న తీరు చర్చక వస్తోంది. తాజాగా శ్రద్ధా షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలాన్ని సునామీలా చుట్టేస్తోంది. తన మిల్కీ నడుమందాన్ని నాభి సౌందర్యాన్ని ఎలివేట్ చేసిన తీరుకు కుర్రకారు స్పెల్ బౌండ్ అయిపోయారు. పూల పట్టు చీర ధరించి నాభి భాగాన్ని ప్రదర్శించిన తీరుకు సలాం కొడుతోంది యూత్. పింక్ జాకెట్టు ..అందమైన కేశాలంకరణ శ్రద్ధా అందాన్ని పదింతలు పెంచాయి. ఈ ప్రయత్నం చూశాక అయినా టాలీవుడ్ టాప్ హీరోలు తమ సినిమాల్లో అవకాశం ఇవ్వకపోతారా..?