బాలీవుడ్ బూతు కోసం శ్రద్దా సోకులు

Update: 2016-06-26 04:29 GMT
తెలుగులో నిలదొక్కుకునేందుకు శ్రద్ధా దాస్ చాలానే ప్రయత్నాలు చేసింది. చేతికి వచ్చిన అన్ని రోల్స్ ను అంగీకరించి తన ట్యాలెంట్ ను చూపించేందుకు ట్రై చేసింది. హాట్ నుంచి హీట్ పుట్టించే రోల్స్ వరకు.. సీన్స్ నుంచి సాంగ్స్ వరకూ బాగానే కష్టపడ్డా పెద్దగా ఫలితం దక్కలేదు. అందుకే తనలో దాగి ఉన్న మరో ట్యాలెంట్ ను చూపించేందుకు రెడీ అయిపోయింది.

అయితే కొత్త ట్యాలెంట్ చూపించేది మన దగ్గర కాదు. బాలీవుడ్ జనాలకు తనలోని హాట్ నెస్ లో కొత్త యాంగిల్ ని పరిచయం చేయబోతోంది ఈ సుందరాంగి. అది కూడా అడల్ట్ కామెడీ కానుండడం విశేషం. త్వరలో విడుదల కానున్న గ్రేట్ గ్రాండ్ మస్తీలో తన విశ్వరూపం చూపించబోతోంది శ్రద్ధాదాస్. ఇక్కడ కనిపిస్తున్న హాట్ లుక్ ఆ సినిమా కోసం చేసిన ఫోటో షూట్ లో భాగంగా తీసినదే. ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం ఈమెకు కొత్తేం కాదు కానీ.. ఇంత హాట్ లుక్స్ తో రెచ్చగొట్టడం మాత్రం కొత్తే అని చెప్పాలి.

అలాగని ఇలాంటి కామెడీ చేయడం ఈ భామకు పూర్తిగా కొత్తేం కాదు. రీసెంట్ గానే గుంటూరు టాకీస్ అంటూ టాలీవుడ్ లో అబ్బాయిని రేప్ చేసే కేరక్టర్ లో కనిపించి బాగానే నవ్వించింది. అయితే కెరీర్ మాత్రం టర్న్ కాలేదు. మరిప్పుడు బాలీవుడ్ లో గ్రేట్ గ్రాండ్ మస్తీ అయినా.. ఈ భామకు బ్రేక్ ఇస్తుందో లేదో!
Tags:    

Similar News