తెరపై కనిపించే బాలకృష్ణ వేరు. బయట కనిపించే బాలకృష్ణ వేరు. తెరపై ఎగ్రెసివ్ పాత్రలతో అదరగొడతాడు కానీ... బయట మాత్రం అందరితో కలివిడిగా సరదాగా గడుపుతుంటారు. చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా అందరితోనూ ప్రేమగా మెలుగుతుంటారు. కానీ ఆయన సీనియర్ హీరో కదా అని, తెరపై ఎగ్రెసివ్ పాత్రల్లో నటిస్తుంటారు కదా అని హీరోయిన్లంతా బాలయ్యని చూడగానే భయపడిపోతుంటారు. సెట్ లో ఆయనతో నటించడమెలాగో అని కంగారు పడిపోతుంటారు. శ్రద్ధాదాస్ కూడా అలాగే భయపడిపోయిందట. డిక్టేటర్ లో టింగ టింగ అంటూ సాగే పాటలో ఆమె బాలయ్యతో కలిసి ఆడిపాడింది మరి. ఇటీవలే ఆ పాటని తీశారు. ఆ పాట గురించి, అందులో నటించడం గురించి శ్రద్ధ ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడింది.
మొదట్లో బాలయ్య అనగానే నేనూ భయపడ్డాను కానీ.. సెట్లో ఆయన ఓపిక - అందించిన సహకారం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది శ్రద్ధాదాస్. ``అసలు పాట గురించి ఏమీ తెలుసుకోకుండా నేను ఓకే చెప్పా. కానీ షూటింగ్ రేపనగా హైదరాబాద్ కి వచ్చి400సార్లు ఆ పాటని వినుంటా. అలాగే డ్యాన్స్ విషయం రిహార్సల్స్ చేశా. అయినా సెట్ లో కంగారుగా అనిపించింది. అదంతా బాలయ్య ఇమేజ్ మహిమే. పాటలో ఆయన బుగ్గలపై చేయి పెట్టే సన్నివేశం ఒకటుంది. నేనేమో కాస్త జంకా. కానీ బాలయ్య మాత్రం ``కంగారేమీ వద్దు - కాన్ఫిడెంట్ గా చేయి పెట్టు యార్... `` అని చెప్పినట్టు తెలిపింది శ్రద్ధ.