బాలీవుడ్ లో బయోపిక్ ల వైనం గురించి చెప్పాల్సి న పనిలేదు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ బయోపిక్ లు ఒక్కొక్కటిగా తెరపై ఆవిష్కృతం అవుతూనే ఉంటాయి. వీటితో పాటు వాస్తవ సంఘనటలు ఆధారంగానూ ఇటీవలి కాలంలో తరుచూ మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ తర్వాత దేశంలో చోటు చేసుకున్న..చోటు చేసుకుంటోన్న అనేక సంఘటనలు ఆధారంగానూ సినిమాలు తెరకెక్కుతున్నాయి.
తాజాగా ఓ ఉగ్రవాదిని హతమార్చిన అమ్మాయి జీవిత కథని వెలుగులోకి తీసుకొస్తున్నారు. 2009 లో ఉగ్రవాదులు తన ఇంటిపై దాడి చేసిన సమయంలో ధైర్యంగా ఓ ఉగ్రవాదిని చంపిన కశ్మీరీ అమ్మాయి రుక్సానా ని స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రుక్సానా పాత్రలో శ్రద్దా కపూర్ నటిస్తుందని సమాచారం.
దాడి నేపథ్యంలో ఆయువతి ఆ సంఘటనలు ఎలా ఎదుర్కోంది. అంతకు ముందు ఇంటి వద్ద వాతావరణం ఎలా ఉండేది? ఘటన తర్వాత ఎలాంటి పరిస్థితులున్నాయి? వంటి అంశాల్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారుట. అయితే ఈ సినిమాకి దర్శకుడు.. నిర్మాత వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇక శ్రద్దా కపూర్ కొన్నాళ్లగా సోలో నాయికగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది.
ఆ మధ్య అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత కథలోనటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోసారి సాహసోపేతమైన యువతి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. అలాగే లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు బాగానే చేస్తోంది. ఇటీవలే' స్ర్తీ-2' సినిమా కూడా చేస్తున్నట్లు ప్రకటించారు.
అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్ర్తీ 'అప్పట్లో ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కామెడీ హారర్ లో శ్రద్దా కపూర్ పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. నటిగా శ్రద్దా కపూర్ ని మరో మెట్టు పైకెక్కించిన చిత్రమది.
కమర్శియల్ గా సినిమా భారీ వసూళ్లను సాధించింది. 18 కోట్లతో నిర్మించిన చిత్రం 180 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అదుకు' స్ర్తీ-2' తో మరోసారి సంచలనాలు నమోదు చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.