ఫస్ట్ లుక్: శ్రద్ధగా సైనాగా మారింది!

Update: 2018-09-26 09:13 GMT
ఇది బయోపిక్ ల సీజన్. ఇప్పటికే చాలా బయోపిక్ లు రిలీజ్ కాగా మరికొన్ని బయోపిక్ లు సెట్స్ మీద ఉన్నాయి. అలాంటి బయోపిక్స్ లో ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ఒకటి.  బాడ్మింటన్ ప్లేయర్ గా అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చిన సైనా నెహ్వాల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది.

ఈ సినిమాలో సైనా పాత్రలో శ్రద్ధ ఎలా ఉంటుంది అనేదానికి సమాధానంగా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.  అచ్చుగుద్దినట్టుగా సైనా నెహ్వాల్ లాగా కనిపిస్తోంది.  సైనా లాగా జస్ట్ స్పోర్ట్స్ జెర్సీ వేసుకోవడమే కాదు.. సైనా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో సరిగ్గా అలానే నిలబడి అందరికీ పెద్ద సర్ ప్రయిజ్ ఇచ్చింది.  హెయిర్ స్టైల్..  స్మైల్ అన్నీ సైనాలాగానే.  చంద్రముఖి లో రజనీ చెప్పిన స్టైల్ లో 'పూర్తిగా సైనాగా మారిపోయిన శ్రద్ధను చూడండి' అన్నట్టుగా ఉంది.  

ఈ సినిమాలో సైనా పాత్రకు  న్యాయం చేసేందుకు శ్రద్ధ బ్యాడ్మింటన్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది.  అంతే కాకుండా సైనా ను రెగ్యులర్ గా కలుస్తూ తన బాడీ లాంగ్వేజ్ లాంటివి అన్నీ అబ్జర్వ్ చేసిందట. మరి ఆ హార్డ్ వర్క్ అంతా పని చేసినట్టు అనిపిస్తోంది కదా.  

ఇదిలా ఉంటే శ్రద్ధ రీసెంట్ గా బాలీవుడ్ హారర్ ఫిలిం 'స్త్రీ' తో విజయం సాధించింది. మరో బాలీవుడ్ చిత్రం 'బత్తి గుల్ మీటర్ చాలూ' సెప్టెంబర్ 20 న రిలీజ్ అయింది. ఇవి కాకుండా ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' లో హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News