శ్రద్ధాకపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఆషికీ 2తో అమ్మడు తారా జువ్వలా దూసుకువచ్చింది. తర్వాత ఏక్విలన్తో స్టార్ డమ్ ను రెట్టింపు చేసుకుంది. ఇటీవలే నటించిన ఏబిసీడి-2 చిత్రంలో నటన - డ్యాన్సులు ఇరగదీసింది. ఇప్పుడు కుర్ర హీరోయిన్లలలో అమ్మడు టైమ్ బాగా నడుస్తోంది.. ఎక్కడా విరామం లేకుండా పూర్తిగా వృత్తిపైనే కాన్సంట్రేషన్ చేస్తోంది.. పగలు, రాత్రి అనే అనే తేడా లేకుండా సినిమాలతో బిజీ అయిపోయింది. అటు ప్రచార కర్తగాను వ్వవహరిస్తు రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం అమ్మడు టైగర్ ష్రాఫ్ సరసన కథానాయికగా ‘బాగీ’ అనే చిత్రంలో నటిస్తుంది.
కొన్ని రోజల క్రితం ఈ సినిమా షూటింగ్ ను కేరళలో పూర్తి చేసుకుని ముంబై వచ్చిన శ్రద్ధ వెంటనే ఓ యాడ్ షూటింగ్ నిమిత్తం రొమానియా కంట్రీ ఫ్లయిట్ ఎక్కేశారు. రెండు రోజులే షూటింగ్ షెడ్యూల్. ఇక ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఏకధాటిగా 14 గంటల పాటు చిత్రీకరణలో పాల్గొంది. చూసారా అమ్మడు ఏ రేంజ్ లో కష్టపడుతుందా? అక్కడ నాయికలు పోటీని తట్టుకుని నిలబడాలంటే కష్టం తప్పనిసరి. అప్పుడే బాలీవుడ్ లో రాణించగలరు. లేదంటో ఏడాదిలోపే తిరుగు మఖం పట్టాల్సి ఉంటుంది... ఈ సంగతిని ముందే పసిగట్టేసి కమిట్ మెంట్ తో పనిచేస్తోంది క్యూట్ బేబి.